ETV Bharat / bharat

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 16వేల మందికి వైరస్

author img

By

Published : Jul 3, 2022, 9:30 AM IST

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజే 16,103 మందికి వైరస్​ సోకింది. మరో 31 మంది చనిపోయారు.

India covid cases
India covid cases

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 16,103 మంది వైరస్​ బారినపడగా.. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 13,929 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.54 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.26 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.27%గా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,34,86,326
  • మొత్తం మరణాలు: 5,25,199
  • యాక్టివ్​ కేసులు: 1,11,711
  • కోలుకున్నవారి సంఖ్య: 4,28,65,519
  • Vaccination India: భారత్​లో శనివారం 10,10,652 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,95,72,963 కోట్లకు చేరింది.

ఇదీ చదవండి: 'రూ.350 లంచం కేసు'.. 24ఏళ్ల క్రితం విధించిన శిక్షను కొట్టివేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.