ETV Bharat / bharat

దేశంలో కరోనా ఉద్ధృతి.. 4.14శాతానికి పాజిటివిటీ రేటు

author img

By

Published : Jul 2, 2022, 9:39 AM IST

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 17,092 మందికి వైరస్​ సోకింది. మరో 29 మంది చనిపోయారు. 14,684 మంది కోలుకున్నారు.

India cases
India cases

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 17,092 మంది వైరస్​ బారినపడగా.. మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 14,684 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.54 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.25 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4.14%గా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,34,86,326
  • మొత్తం మరణాలు: 5,25,168
  • యాక్టివ్​ కేసులు: 1,09,568
  • కోలుకున్నవారి సంఖ్య: 4,28,51,590

Vaccination India: భారత్​లో శుక్రవారం 9,09,776 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,84,80,015 కోట్లకు చేరింది. మరో 4,12,570 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 824,945 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,502 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,26,48,933కు చేరింది. మరణాల సంఖ్య 6,359,970 చేరింది. ఒక్కరోజే 449,286 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 528,318,991గా ఉంది.

  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 125,066 కొత్త కేసులు బయటపడగా.. 52 మంది మరణించారు.
  • అమెరికాలో 102,788 కేసులు వెలుగుచూశాయి. 283 మందికిపైగా చనిపోయారు.
  • జర్మనీలో కొత్తగా 98,669మందికి వైరస్​ సోకగా.. 284 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీ ఒక్కరోజే 86,334 మంది కొవిడ్​ బారినపడగా.. 72 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 75,749 కేసులు నమోదు కాగా.. 298 మంది మరణించారు.

ఇదీ చదవండి: 'రూ.350 లంచం కేసు'.. 24ఏళ్ల క్రితం విధించిన శిక్షను కొట్టివేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.