ETV Bharat / bharat

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలి హత్య.. ఫ్రిజ్​లో మృతదేహం.. శ్రద్ధా వాకర్​ కేసులానే..

author img

By

Published : Feb 14, 2023, 7:35 PM IST

శ్రద్ధావాకర్​ హత్య తరహా ఘటన మరొకటి దిల్లీలో జరిగింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు ఓ యువతిని హత్య చేసి దాబాలోని ఫ్రిజ్​లో దాచిపెట్టాడు ఓ కిరాతకుడు. మహారాష్ట్రలో జరిగిన మరో ఘటనలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని హత్య చేశాడు ఓ వ్యక్తి.

killed and hide dead body in fridge
killed and hide dead body in fridge

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్​ తరహా ఘటన మరొకటి జరిగింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు ఓ యువతిని హత్య చేసి దాబాలోని ఫ్రిజ్​లో దాచిపెట్టాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీ శివార్లలోని హరిదాస్​పుర్​లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని నాలుగు రోజుల క్రితమే హత్య చేసి ఫ్రిజ్​లో పెట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

మిత్రావు గ్రామానికి చెందిన సహిల్ గహ్లోత్​, ఉత్తమ్​నగర్​ ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. అయితే, ప్రేమించిన యువతితో కాకుండా.. మరో అమ్మాయితో పెళ్లిని నిశ్చయించుకున్నాడు గహ్లోత్​. ఫిబ్రవరి 10న వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. గహ్లోత్​తో గొడవ పడింది. ఈ క్రమంలోనే ఆగ్రహించిన గహ్లోత్​.. ఆమెను హత్య చేసి తన దాబాలోని ఫ్రిజ్​లో దాచిపెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.

ఇలాంటి ఘటనే గతేడాది దిల్లీలో జరిగింది. అఫ్తాబ్​ పూనావాలా అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్​ను హత్య చేసి 35 ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఫ్రిజ్​లో దాచిపెట్టాడు. మూడు వారాల పాటు ఫ్రిజ్​లో ఉంచిన తర్వాత శరీర భాగాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.

ప్రియురాలిని హత్య చేసి పరుపులో మూటగట్టి..
మహారాష్ట్ర పాల్ఘర్​లో దారుణం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని హత్య చేశాడు ఓ కిరాతకుడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.
తులింజ్​ ప్రాంతానికి చెందిన మేఘ నర్సుగా పనిచేస్తోంది. నిందితుడు కొన్నిరోజులుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. సోమవారం ఆమె నివసిస్తున్న ఇంటి నుంచి వాసన రావడం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోకి వెళ్లగా మహిళ మృతదేహం పరుపులో మూటగట్టి కనిపించింది. నిందితుడు ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండటం వల్ల ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మేఘను హత్యచేసి ఉంటాడని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: కానిస్టేబుల్​ను కారుతో ఢీకొట్టి.. కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన డ్రైవర్​

1999 పేజీలు.. 8 కేజీలు.. 111 పెన్నులతో భారీ ప్రేమలేఖ రాసిన 'వరల్డ్ ఫేమస్ లవర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.