ETV Bharat / bharat

స్వీపర్​కు హ్యాట్సాఫ్​.. దొరికిన వజ్రాలను యజమానికి అందజేత.. వాటి విలువ ఎంతంటే?

author img

By

Published : Jun 25, 2022, 12:31 PM IST

ఓ స్వీపర్​ నిజాయతీతో అందరి మనసు గెలుచుకున్నాడు. తను పని చేసే ఫ్యాక్టరీలో ఊడుస్తున్న సమయంలో వజ్రాల ప్యాకెట్లు దొరకగా.. వాటిని తను తీసుకోకుండా.. యజమానికి అందజేసి శభాష్​ అనిపించుకుంటున్నారు. ఇంతకీ అతనెవరు? ఆ వజ్రాల విలువెంత? మరోవైపు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ కూలీని అదృష్టం రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది.

In Surat, the cleaning worker returned the diamond worth 1 lakh to the owner
స్వీపర్​కు హ్యాట్సాఫ్​.. దొరికిన వజ్రాలను యజమానికి అందజేత.. వాటి విలువ ఎంతంటే?

రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా దొరికితే వెంటనే తీసుకుంటాం. ఇక అది బంగారమైతే.. ఒక వేళ వజ్రాలైతే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. అది ఎవరు పోగోట్టుకున్నది మనకు అనవసరం. అయితే సూరత్‌కు చెందిన ఓ స్వీపర్ అలా అనుకోలేదు. తనకు దొరికిన వజ్రాలను యజమానికి అందజేసి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

ఇదీ జరిగింది..
సూరత్‌లోని కాటార్‌గామ్‌లో గల పంచదేవ్ అనే ఫ్యాక్టరీలో వినోద్ స్వీపర్​గా పని చేస్తున్నాడు. ఫ్యాక్టరీలోని పార్కింగ్​ స్థలంలో ఊడుస్తున్నప్పుడు అతనికి రెండు ప్యాకెట్లు కనిపించాయి. అందులో వజ్రాలు ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయిన వినోద్​.. ఆ వజ్రాల ప్యాకెట్లను పరిశీలించి.. సేత్నే డైమండ్ అసోసియేషన్‌ను సంప్రదించాడు. వారికి జరిగిన విషయాన్ని చెప్పాడు. వాటి విలువ రూ. లక్ష ఉంటుందని సేత్నే డైమండ్ అసోసియేషన్‌ నిర్వాహాకులు నిర్ధరణకు వచ్చారు. ఎవరు పోగొట్టుకున్నారన్న దానిపై వాకబు చేశారు. ఆ ప్యాకెట్లు రమేశ్‌భాయ్‌కు చెందినవిగా గుర్తించారు. రమేశ్‌భాయ్‌కు ప్యాకెట్లను అందజేశారు. వినోద్​ నిజాయతీని మెచ్చుకుని అతడిని సన్మానించారు.

In Surat, the cleaning worker returned the diamond worth 1 lakh to the owner
వినోద్​కు దొరికి వజ్రాల ప్యాకెట్లు

రాత్రికి రాత్రే లక్షాధికారి..
అదృష్టం​.. మధ్యప్రదేశ్​కు చెందిన ఓ కూలీని రాత్రికి రాత్రే అతణ్ని లక్షాధికారిని చేసింది. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్​ పన్నా జిల్లాలో ఈ సంఘటన ఒక కూలీకి లక్షల విలువ చేసే వజ్రం లభించింది. పన్నా జిల్లాలో కృష్ణ కళ్యాణ్‌పూర్ పట్టిలో గత 9నెలలుగా గనిని లీజుకు తీసుకున్న సురేంద్ర లోధీ వ్యక్తి.. తవ్వకాలు చేపడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి ప్రకాశవంతమైన 3.15 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో సురేంద్ర ఆ వజ్రాన్ని వెంటనే జిల్లా డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేశాడు. అనంతరం దాన్ని వేలం వేయనున్నారు. దాని విలువ రూ. 15 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

A Daily Wage Laborer Got A Diamond Of 3.15 Carat, Estimated Value Of Rs 15 Lakh
సురేంద్రకు దొరికి వజ్రం

గతంలో సురేంద్ర.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి దినసరి కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కరోనా లాక్​డౌన్​ వల్ల పనులు లేకపోవడం వల్ల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కృష్ణ కళ్యాణ్‌పూర్‌లో వజ్రాల గనిని లీజుకు తీసుకున్నాడు. 9నెలల శ్రమ తర్వాత.. అతనికి రూ.లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. వజ్రం అమ్మగా వచ్చిన డబ్బును చదువుకు వినియోగిస్తానని చెప్పాడు సురేంద్ర. గ్రామంలోని గుడిలో మెట్లను నిర్మిస్తానని వెల్లడించారు.

పన్నాలో చాలా మంది కార్మికులు చిన్నచిన్న గనులను లీజుకు తీసుకుని, వజ్రాల కోసం వెతుకుతుంటారు. అందులో కొంతమందిని మాత్రం అదృష్టం వరించి.. వజ్రాలు దొరుకుతాయి. ముడిరూపంలో దొరికే వజ్రాలను.. డైమండ్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ వారు ఆ వజ్రాలను వేలం వేస్తారు. ఈ వేలంలో పెద్ద పెద్ద వ్యాపారులు, సంస్థలు పాల్గొంటాయి. వేలం వేయగా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని అధికారులు.. వజ్రం యజమానికి అందిస్తారు.

ఇదీ చదవండి: భార్యను కాటేసిన పాము.. డాక్టర్లకు క్లారిటీ కోసం భర్త ఏం చేశాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.