'నాసా' పేరుతో 100 మందిని బురిడీ కొట్టించిన దుండగులు.. రూ.6 కోట్లు స్వాహా!

author img

By

Published : Feb 2, 2023, 1:17 PM IST

Fraud in the name of NASA news

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేరుతో 100 మందికి టోకరా వేశారు దుండగులు. వారి నుంచి రూ.ఆరు కోట్లు దోచుకున్నారు!. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?

మహారాష్ట్రలో కొంతమంది దుండగులు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేరుతో 100 మందికి టోకరా వేశారు. వారి నుంచి సుమారు ఐదారు కోట్లు దోచుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ జరిగింది..
కొంతమంది వ్యక్తులు నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ పేరుతో 'రైస్​పుల్లర్' యంత్రాంగంపై పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయని బాధితులకు తెలిపారు. నాసా శాస్త్రవేత్తలు ఈ యంత్రంపై పరిశోధనలు చేస్తున్నారంటూ.. ప్రస్తుతం ఈ మెటల్ కుండకు మంచి డిమాండ్ ఉందని వారితో నిందితులు చెప్పారు. దీంతోపాటు కొన్ని నకిలీ పత్రాలను చూపించి వారు చెప్పింది నిజమేనని బాధితులకు నమ్మించి కొంత నగదును తీసుకున్నారు.

అయితే ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సాన్​వానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో నిందితులు 100 మందికి టోకరా వేసి సుమారు రూ. 6 కోట్లు దోచుకున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.