ETV Bharat / bharat

Four Children Died in Gadwal : గద్వాల జిల్లాలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

author img

By

Published : Jun 5, 2023, 2:59 PM IST

Updated : Jun 5, 2023, 7:55 PM IST

Four Children Died in Gadwal
Four Children Died in Gadwal

14:57 June 05

నలుగురు మృతి

Four Children Died in Krishna River at Borivali: పిల్లలందరూ సరదాగ గడిపేందుకు.. నది దగ్గరకు వెళ్లారు. వెళ్లిన వారిలో పెద్దవాళ్లు ఎవరు లేరు. అక్కడ ఆడుకుంటున్న క్రమంలో కాలికి మట్టి అంటుకుంది. దాని కడిగే సమయంలో నదిలో ఒక పిల్లవాడు పడిపోయాడు. వాడిని కాపాడేందుకు మరో అమ్మయి పడిపోయింది. ఇలా రక్షించే క్రమంలోనే నలుగురు పిల్లలు నదిలో పడి మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నదిలో దిగి గాలించారు. చివరికి ఆ నలుగురు ప్రాణం లేకుండా విగత జీవిగా లభ్యంమయ్యారు. ఈ ఘటన గద్వాల జిల్లాలో జరిగింది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన మున్నా, ఇస్మాయిల్,ఇబ్రహీంలు అన్నదమ్ములు. బతుకుదెరువు కోసం కర్నూలుకు వలస వెళ్లి.. అక్కడే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వేసవి సెలవుల్లో అన్న దమ్ములు, అక్కచెల్లలతో ఆటలాడుకునేందుకు ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు బందువైన మావనపాడు మండలం బోరవల్లికి చెందిన మాసుం ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. సరాదాగా గడిపేందుకు మాసుం ఇద్దరు పిల్లలు, మున్నా ఇద్దరు పిల్లలు, ఇస్మాయిల్ ముగ్గురు పిల్లలు, ఇబ్రహీం ముగ్గురు పిల్లలు మొత్తం 10 మంది కలసి ఇటిక్యాల మండల గార్లపాడు గ్రామానికి సమీపంలోని మంగపేట గ్రామ శివారులో కృష్ణానదికి వెళ్లారు. నదిలో ఈత కొట్టేందుకు దిగారు. మాసుం కుమారుడు ఇమాం నది లోపలికి వెళ్లొదంటు హెచ్చరిస్తూ నది ఆవతల ఒడ్డుకి వెలుతుండగా ఇస్మాయిల్ కుమారులు సమీర్(18), రిహాన్ (15)లతో పాటు.. ఇబ్రహీం కూతుర్లు అఫ్రీన్(17), నౌషిన్(15)లు నదిలో లోతట్టు ప్రాంతానికి వెళ్లి మునిగిపోయారు.

Man drowned at Hayatnagar : బావిలో ఈతకు దిగి వ్యక్తి మృతి.. మొబైల్​లో రికార్డయిన దృశ్యాలు

ఈ విషయం గమనించిన ఇమామ్ నదిలోకి దూకి అఫ్రిన్, నౌషిన్ను ఓడ్డుకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే అలల తాకిడికి అఫ్రిన్, నౌషిన్లు నది లోపలికి కొట్టుకు రాగా సమీర్, రిహాన్​లను రక్షించేందుకు ప్రయత్నించినా.. నలుగురికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. కనుచూపు మేరలో ఎవ్వరు లేకపోవడంతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న స్థానిక పోలీసులు.. ఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో నలుగురు మృతదేహాలను బయటకు తీశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను శవపంచానామ నిమిత్తం గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై బాధితులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలంపూరు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

"ఈరోజు మధ్యాహ్నం కర్నూల్​కి చెందిన కొంత మంది పిల్లలు వాళ్ల బంధువుల ఇంటికి వచ్చారు. వాళ్లందరు కలసి కృష్ణానదికి ఈత కోసం వెళ్లారు. వాళ్లు ఇసుకలో ఆడుతుండగా రిహాన్​ అనే పిల్లవాడికి కాళ్లకి మట్టి అంటుకుంది. దీంతో కడుకునేందుకు నదిలో దిగాడు. కాళు జారి నదిలో పడిపోయాడు. ఆ పిల్లవాడిని పట్టుకునేందుకు అఫ్రిన్​ ప్రయత్నించింది. ఆ అమ్మాయి జారి పోయింది. వాళ్లను రక్షించేందుకు వచ్చిన నౌషిన్​, సమీర్​ ఇద్దరు నదిలో పడిపోయారు. వారిని బయటకి తీసేసరికి చనిపోయారు."- శ్రీనివాస్​, స్థానిక సీఐ

ఇవీ చదవండి :

Last Updated :Jun 5, 2023, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.