ETV Bharat / bharat

ఆడుదాం ఆంధ్రాలో జగన్​కు ఝలక్​ - ఆడలేనంటూ అంబటి రాయుడు హిట్ వికెట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 10:47 AM IST

Updated : Jan 7, 2024, 7:43 AM IST

Former Cricketer Ambati Rayudu Quit YSRCP: మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు వైఎస్సార్​సీపీని వీడారు. ఇటివలే సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన ట్విటర్​(X) వేదికగా పార్టీని వీడినట్లు ప్రకటించారు.

Etv Bharat
ఆడుదాం ఆంధ్రాలో జగన్​కు ఝలక్​

Former Cricketer Ambati Rayudu Quit YSRCP : ఏపీలో అధికార వైఎస్సార్సీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీని వీడుతున్నట్లు మాజీ భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ (X) చేశారు. "రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా" అని తెలిపారు.

గ్రౌండ్​లోకి వెళ్లకుండానే రాయుడు డక్కౌట్ : డిసెంబర్ 28న వైఎస్సార్సీపీ అధినేత జగన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో క్యాంప్‌ కార్యాలయంలో ఆ పార్టీలో చేశారు. పార్టీలో అడుగు పెట్టిన పది రోజుల్లోనే పార్టీ నుంచి యూటర్న్ తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కొద్ది సమయంలోనే పార్టీ వీడటంతో రాజకీయ నిపుణలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో వికెట్‌ పడటంతో అధికార వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

  • This is to inform everyone that I have decided to quit the YSRCP Party and stay out of politics for a little while. Further action will be conveyed in due course of time.

    Thank You.

    — ATR (@RayuduAmbati) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Narasaraopet MP Krishnadevarayulu Sensational Comments: వైఎస్సార్సీపీలో మార్పులు, చేర్పులు ప్రస్తుతం హాట్ టాపిక్​గా మారింది. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో నరసరావుపేట ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం వాస్తమేనని చెప్పిన ఆయన ఈసారి తనను నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందన్నారు. అయితే ఆయనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో 'అధిష్టానం లెక్కలు వేరు, నా లెక్కలు వేరు'అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తానని పేర్కొన్నారు.

'అధిష్టానం లెక్కలు వేరు - నా ఆలోచనలు వేరు': ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట సీటు లేదనడంపై స్థానిక వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఈసారి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలనడంపై చిలకలూరిపేట నియోజకవర్గంలోని మూడు మండలాల జెడ్బీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాకూ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎంపీని కలసి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు.

'మీకో దండం జగన్'- తాడేపల్లి సీఎంవోకు గుడ్‌బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి

గుంటూరు ఎంపీ టికెట్ జగన్ ఎవరికిస్తారు? : గుంటూరు ఎంపీ టికెట్‌ కేటాయిస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైఎస్సార్సీపీలో చేరారు. అయితే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుని (MP Lavu Sri Krishna Devarayalu) గుంటూరు స్థానానికి మారాల్సిందిగా శుక్రవారం జగన్‌ ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి ఏ మాత్రం అంగీకరించని శ్రీకృష్ణ దేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గుంటూరు స్థానాన్ని ఆశించిన రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది.

ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామాకి కారణం ఏంటి - ఆయన మౌనం దేనికి సంకేతం?

Last Updated :Jan 7, 2024, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.