ETV Bharat / bharat

రూ.53వేల ఐఫోన్ ఆర్డర్ ఇస్తే.. 'నిర్మా' సబ్బులు డెలివరీ!

author img

By

Published : Oct 11, 2021, 3:07 PM IST

ఆన్​లైన్​లో షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. రూ.53 వేలు విలువ చేసే ఐఫోన్​ను ఆర్డర్ ఇస్తే.. పార్సిల్​లో నిర్మా సబ్బులు వచ్చాయి. (Flipkart wrong product delivered) దీంతో యూజర్ కంగుతిన్నాడు.

IPHONE
రూ.53 వేల ఐఫోన్ ఆర్డర్ ఇస్తే.. 'నిర్మా' సబ్బులు డెలివరీ!

ఐఫోన్ కొనడం చాలా మంది మధ్య తరగతి వ్యక్తులకు ఓ కల. అలాంటిది ఖరీదైన యాపిల్ ఫోన్​ను ఆన్​లైన్​లో ఆర్డర్ ఇస్తే.. తీరా అది వచ్చాక అందులో ఐఫోన్​ లేకపోతే..? ఇలాంటి అనుభవమే సిమ్రన్​పాల్ సింగ్​ అనే వ్యక్తికి ఎదురైంది. (Flipkart wrong product delivered)

బిగ్ బిలియన్ డేస్ (Flipkart big billion days) ఆఫర్​లో భాగంగా రూ.53 వేలు విలువ చేసే యాపిల్ ఐఫోన్​ 12ను ఫ్లిప్​కార్ట్​లో ఆర్డర్ చేశారు సిమ్రన్​పాల్. కానీ తీరా వచ్చాక చూస్తే అందులో ఐఫోన్ (Apple iPhone 12) లేదు. పార్సిల్​లో రెండు నిర్మా సబ్బులు (Nirma Washing soap) వచ్చాయి. యూట్యూబ్​లో వీడియో అప్​లోడ్ చేసి తన అనుభవాన్ని వివరించారు సిమ్రన్​పాల్.

దీనిపై ఫ్లిప్​కార్ట్ కస్టమర్ కేర్​ను సంప్రదించగా.. కొన్ని రోజుల తర్వాత సిమ్రన్​పాల్ ఆర్డర్​ను సంస్థ రద్దు చేసింది. పొరపాటు వల్ల అలా జరిగిందని గుర్తించింది. ఆర్డర్​ను రద్దు చేసి ఐఫోన్​ కోసం చెల్లించిన నగదును కస్టమర్​కు రీఫండ్ చేసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.