ETV Bharat / bharat

కరెంట్ స్తంభానికి కట్టి కర్రలతో దాడి.. గిలగిలా కొట్టుకుంటూ వృద్ధుడు మృతి

author img

By

Published : Aug 7, 2022, 12:37 PM IST

వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులు.. వయసు మీదపడిన వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించారు. కరెంట్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే??

family members attack on old man
Etv Bharat

వృద్ధుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన కుటుంబ సభ్యులు

ఒడిశా కొరాపుట్​లో దారుణం జరిగింది. ఇంటి పైకప్పు విషయంలో చెలరేగిన గొడవ ఓ వృద్ధుడి ప్రాణాలు తీసింది. వృద్ధుడి పట్ల కుటుంబ సభ్యులు అమానవీయంగా ప్రవర్తించారు. కరెంట్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కర్రలతో కొట్టారు. దీంతో కుర్షా మనియక అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. లక్ష్మీపుర్ బ్లాక్​ ఉపరకుతింగ గ్రామంలో జరిగింది.

Elderly Man Tied To Pole Thrashed To Death
వృద్ధుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన కుటుంబ సభ్యులు

అసలేం జరిగిందంటే: మనియక.. తన సోదరుడు, కుమారుడు, కోడలితో ఇంటి పైకప్పు విషయంలో శుక్రవారం గొడవపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు మనియకను కరెంట్ స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. గిలగిలా కొట్టుకుంటూనే వృద్ధుడు కన్నుమూశాడు.
అనంతరం గ్రామస్థుల సహకారంతో నిందితులు మనియక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వృద్ధుడిని చితకబాదిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకరిని లక్ష్మీపుర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇవీ చదవండి: కంప్యూటర్ సెంటర్​లో మహిళపై గ్యాంగ్​రేప్.. కుమార్తె హత్యకు రూ.లక్ష సుపారీ..

ప్రియుడి ఇంట్లో వివాహిత అలా.. మహిళను తాళ్లతో కట్టేసి దేహశుద్ధి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.