ETV Bharat / bharat

LIVE UPDATES: తీర ప్రాంతం జిల్లాల్లో రెడ్ అలెర్ట్ - రాష్ట్రంపై తీవ్ర ప్రభావం

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 9:38 AM IST

Updated : Dec 4, 2023, 9:29 PM IST

cyclone_michaung_news_live_updates_telugu
cyclone_michaung_news_live_updates_telugu

20:17 December 04

నెల్లూరు ట్రంక్‌రోడ్డులో కూలిన భారీ వృక్షం, 2 కార్లు ధ్వంసం

  • నెల్లూరు తుపాను ప్రభావంతో పలుచోట్ల ఈదురుగాలులు
  • నెల్లూరు ట్రంక్‌రోడ్డులో కూలిన భారీ వృక్షం, 2 కార్లు ధ్వంసం
  • భారీ వర్షాలకు నెల్లూరులో పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా

18:44 December 04

రేపు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు: కలెక్టర్

  • రేపు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు: కలెక్టర్
  • తుపాను దృష్ట్యా రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌
  • తుపాను వల్ల తిరుమల ఘాట్ రోడ్‌లో ద్విచక్రవాహనాలకు ఆంక్షలు
  • రేపు ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకే ద్విచక్రవాహనాలకు అనుమతి
  • కొండచరియలు, పొగమంచు వల్ల ప్రమాదాలు జరగవచ్చని తితిదే ఆంక్షలు

18:44 December 04

నెల్లూరు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం

  • నెల్లూరు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం
  • ఈదురుగాలుల ధాటికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు
  • పెన్నా పరివాహక ప్రాంతాన్ని అప్రమత్తం చేసిన అధికారులు
  • అనంతసాగరం, చేజర్ల, ఆత్మకూరు, సంగం మండలాల్లో ముందుజాగ్రత్తలు
  • సంగం, ఆత్మకూరులోని గిరిజనులను పునరావాస కేంద్రాలకు తరలింపు

17:34 December 04

కృష్ణా జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు

  • కృష్ణా జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు
  • తుపాను తీవ్రత దృష్ట్యా సెలవు ప్రకటించిన కృష్ణా జిల్లా కలెక్టర్‌

17:33 December 04

బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో పదో నెంబర్ ప్రమాద సూచిక

  • బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో పదో నెంబర్ ప్రమాద సూచిక
  • తుపాను తీవ్రత దృష్ట్యా పదో నెంబర్ సూచిక ఎగరేసిన అధికారులు
  • హార్బర్ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరిన అధికారులు

16:25 December 04

తిరుపతి పూలతోట వద్ద 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

  • తిరుపతిలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు
  • తిరుపతి పూలతోట వద్ద 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • తిరుపతిలో ఈదురుగాలులకు పలుచోట్ల విరిగిపడిన చెట్లు
  • చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు

15:17 December 04

మచిలీపట్నం తుపాను రక్షిత భవనంలో ఉన్న బాధితులను పరామర్శించిన ఆర్‌డీవో

  • మచిలీపట్నం: గిలకలదిండిలో ఆర్‌డీవో ఎం.వాణి పర్యటన
  • తుపాను రక్షిత భవనంలో ఉన్న బాధితులను పరామర్శించిన ఆర్‌డీవో
  • ఇప్పటికే మచిలీపట్నం చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌
  • సహాయ చర్యలు, వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించిన ఆర్డీవో

15:13 December 04

తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించిన ప్రభుత్వం

  • తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించిన ప్రభుత్వం
  • బాపట్లకు కాటమనేని భాస్కర్‌, కోనసీమకు జయలక్ష్మి నియామకం
  • తూ.గో.కు వివేక్‌ యాదవ్‌, కాకినాడకు యువరాజ్‌, ప్రకాశంకు – ప్రద్యుమ్న నియామకం
  • నెల్లూరుకు హరికిరణ్‌, తిరుపతికి శ్యామలరావు, ప.గో.కు కన్నబాబు నియామకం

15:06 December 04

తుపానుపై కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

  • తుపానుపై కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌
  • సహాయ చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్
  • ప్రాణనష్టం లేకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • అత్యవసరాల కోసం జిల్లాకు రూ.2 కోట్లు ఇవ్వాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం
  • యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం
  • రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి: సీఎం జగన్‌
  • వర్షాలకు ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10 వేలు సాయం చేయాలి: సీఎం
  • ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలను వినియోగించుకోవాలి: సీఎం జగన్‌
  • పునరావాస క్యాంపుల్లో అన్ని వసతులు కల్పించాలి: సీఎం జగన్‌

14:39 December 04

తిరుమలలో నిండిన గోగర్భం జలాశయం

తిరుమలలో గోగర్భ జలాశయం పూర్తి స్థాయిలో నిండింది. జలాశయం పూర్తి స్థాయిలో నిండటంతో ఏ సమయంలో అయిన గేట్లను ఎత్తివేస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తితిదే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనియ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

13:58 December 04

ఎగసిపడుతున్న అలలు - ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

కృష్ణా జిల్లా కోడూరు మండల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాలకాయతిప్ప, హంసలదీవి, ఊటగుండం, బసవానిపాలెం గ్రామస్థులను కోడూరు మండల కేంద్రానికి తరలించారు. కోడూరు జడ్పీ పాఠశాల, కల్యాణమండపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో అలలు ఎగసిపడుతున్నాయి. పాలకాయతిప్ప బీచ్‌ గేటును అధికారులు మూసివేశారు. రామకృష్ణాపురం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

13:57 December 04

20 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం - పడవలను తరలిస్తున్న మత్స్యకారులు

ప్రకాశం జిల్లా కొత్తపట్నం వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. తుపాను దృష్ట్యా సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. దీంతో మత్స్యకారులు పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

13:52 December 04

తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నాం - ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: వైస్ అడ్మిరల్ రాజేష్

తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నామని తూర్పు నౌకాదళ ప్రధానాధికారి రాజేష్ తెలిపారు. ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలతో సమీక్షిస్తున్నామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైస్ అడ్మిరల్ రాజేష్ అన్నారు. ఐదు యుద్ధ నౌకల్లో సహాయ సామగ్రి సంసిద్ధం చేశామన్నారు.

13:52 December 04

తుపాను నేపథ్యంలో 14 రక్షిత కేంద్రాలు - సిద్ధంగా మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

తుపాను నేపథ్యంలో 14 రక్షిత కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు బాపట్ల కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటివరకు 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, తీర ప్రాంతంలో సిద్ధంగా మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని అన్నారు. సహాయ చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.

13:03 December 04

ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు - సహాయ చర్యల కోసం నంబర్లు

కృష్ణా జిల్లాలో తుపాను దృష్ట్యా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, సముద్రతీర ప్రాంత ప్రజలు, జాలర్లు వేటకు వెళ్లవద్దని సూచించారు. తుపాను దృష్ట్యా తీర ప్రాంతాలు, బీచ్‌లకు ప్రవేశం నిరాకరించారు. సహాయ చర్యల కోసం 112, 100, 94910 68906, 83329 83792 నంబర్లను సంప్రదించాలన్నారు.

12:52 December 04

గంటకు 10 కి.మీ వేగంతో కదులుతున్న తుపాను - హెచ్చరికలు జారీ

Cyclone Michaung Alert: మిచౌంగ్ తీవ్ర తుపానుగా బలపడింది. నైరుతి బంగాళాఖాతంలో వాయవ్య దిశగా తుపాను పయనిస్తోంది. గంటకు 10 కి.మీ వేగంతో తుపాను కదులుతోంది. చెన్నైకి 90 కి.మీ, నెల్లూరుకు 120 కి.మీ, బాపట్లకు 310 కి.మీ, మచిలీపట్నానికి 310 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది.

రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటనుంది. రెండ్రోజులు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 -75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

12:35 December 04

తుపాను దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దు

తుపాను దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను తాత్కాలికంగా దారి మళ్లించారు. రైలు ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు.

12:32 December 04

విమానాశ్రయ రన్ వేపైకి వరద నీరు - సర్వీసులు రద్దు చేసిన అధికారులు

తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయ రన్ వేపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రేణిగుంటకు విమాన రాకపోకలను అధికారులు రద్దు చేశారు.

12:32 December 04

ఎగసిపడుతున్న అలలు - కోతకు గురవుతున్న తీరప్రాంత గ్రామాలు

కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ తీరప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు మీదుగా రాకపోకలు నిలిపివేశారు.

12:32 December 04

తుపాను దృష్ట్యా పలు విమాన సర్వీసులు రద్దు

తుపాను దృష్ట్యా పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విశాఖ-చెన్నై ఇండిగో విమానం, విశాఖ-హైదరాబాద్‌ ఇండిగో విమానం, విశాఖ-విజయవాడ ఇండిగో విమానం రద్దు అయ్యాయి.

12:09 December 04

తుపాను ప్రభావంతో కృష్ణా నదిలో పంటు నిలిపివేత

తుపాను ప్రభావంతో కృష్ణా నదిలో పంటు నిలిపివేశారు. నాగాయలంక మండలం ఏటిమొగ-ఎదురుమొండి మధ్య నడిచే పంటును నిలిపివేశారు. పంటు నిలిపివేతతో ఎదురుమొండి దీవుల నుంచి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

11:51 December 04

వర్షం వల్ల తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు అనుమతి నిరాకరణ

Tourist Spots Visiting Stopped in Tirumala Due to Rain: వర్షం వల్ల తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు అనుమతి నిరాకరించారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో పాపవినాశనం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ ప్రాంతాలకు అనుమతి నిరాకరిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడగా వాటిని సిబ్బంది తొలగిస్తున్నారు.

11:44 December 04

రెడ్ అలెర్ట్ జారీ - అన్ని తీరప్రాంత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

మిచౌంగ్ తుపాను కోస్తాంధ్ర తీరానికి చేరువగా వచ్చింది. నెల్లూరుకు 210 కి.మీ, బాపట్లకు 310 కి.మీ, మచిలీపట్నానికి 330 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం అయి ఉంది. కాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడనుంది. రేపు మధ్యాహ్నంలోపు తీవ్ర తుపాను తీరాన్ని దాటనుంది. నిజాంపట్నం వద్ద తీరం దాటనుంది. కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదలనుంది.

తుపాను తీరాన్ని దాటే వేళ 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ప.గో. జిల్లాల్లో భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, కడప, ఎన్టీఆర్, ఏలూరు, తూ.గో., అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

కోస్తాంధ్ర తీరంలో సముద్రంలో దాదాపు 1.5 మీటర్ల ఎత్తులో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువస్తోంది. తీరం వెంబడి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర తీరప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేయగా, పాఠశాలలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని తీరప్రాంత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

11:20 December 04

తుపాను బాధితులకు కార్యకర్తలు అండగా నిలవాలి: చంద్రబాబు

తుపాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. రైతులకు నష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలని, తుపాను బాధితులకు కార్యకర్తలు అండగా నిలవాలి అన్నారు.

11:20 December 04

తుపాను తీవ్రత దృష్ట్యా యువ‌గ‌ళం పాద‌యాత్రకు విరామం: లోకేశ్

తుపాను ముప్పు దృష్ట్యా ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తుపాను సహాయక చర్యల్లో కార్యకర్తలు పాల్గొనాలని, బాధితులకు అండగా నిలవాలని సూచించారు. తుపాను తీవ్రత దృష్ట్యా యువ‌గ‌ళం పాద‌యాత్రకు విరామం ఇచ్చినట్లు తెలిపారు.

10:13 December 04

గుంటూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం రద్దు చేశారు. జిల్లాలోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. గుంటూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు.

10:10 December 04

ఈదురుగాలులతో నేలకూలిన చెట్లు - నిన్న రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం

Rains in Tirupati District: తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. నిన్న రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, వరదనీటితో వాగులు, వంకలు పొంగుతున్నాయి. గోవర్ధనపురం వద్ద పాముల కాలువలో, కడూరు వద్ద సున్నపు కాలువలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సీఎల్ఎన్ పల్లి, పాండూరు వద్ద పాముల కాలువ, రాళ్ల వాగు పొంగుతున్నాయి. రహదారిపై వరద ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి.

09:56 December 04

విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం - ఆందోళనలో రైతులు

విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా వరి రైతులు ఆందోళనలో ఉన్నారు.

09:56 December 04

ఉమ్మడి ప.గో. జిల్లాలో పలుచోట్ల ఉదయం నుంచి వర్షం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. తుపాను దృష్ట్యా జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

09:55 December 04

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు - మత్స్యకారుడు గల్లంతు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నారు. తుపాను దృష్ట్యా నేడు జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేశారు. డొంకూరు తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు అయ్యాడు.

09:55 December 04

విశాఖలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం - పాఠశాలలకు సెలవు

విశాఖలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. తుపాను దృష్ట్యా జిల్లాలోని పాఠశాలలకు సెలవు ఇచ్చారు.

09:55 December 04

కోనసీమ, కాకినాడ తీరంలో ఎడతెరిపిలేని వర్షం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. కోనసీమ, కాకినాడ తీరంలో ఎడతెరిపిలేని వర్షం పడుతుండటంతో ఆరబెట్టిన ధాన్యం, కోత కోయాల్సిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.

09:50 December 04

తీరంలో ఎగసిపడుతున్న అలలు - నెల్లూరు జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు

తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉలవపాడు, కావలి, ఇందుకూరుపేట తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ తీరప్రాంతాలను పరిశీలించారు. అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని బకింగ్ హామ్ కాలువ, తీరప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తీరప్రాంతంలోని 9 మండలాల తహశీల్దార్లను అప్రమత్తం చేశారు.

09:49 December 04

అధికారుల ఆదేశాలు బేఖాతరు - తుపాను వేళ ఇంకా కార్యాలయానికి తహశీల్దార్‌

కృష్ణా జిల్లాలో తుపాను వేళ ఇంకా కార్యాలయానికి నాగాయలంక తహశీల్దార్‌ రాలేదు. తహశీల్దార్లు కార్యాలయంలోనే ఉండాలన్న అధికారుల ఆదేశాలు బేఖాతరు చేశారు. తుపాను దృష్ట్యా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. తహశీల్దార్ రాకపోవడంతో ఆర్‌ఐని అడిగి గ్రామస్థులు వివరాలు తెలుసుకుంటున్నారు.

09:34 December 04

ముంపు ప్రమాదంలో శ్రీకాళహస్తి సమీప లంకమిట్ట - అప్రమత్తం చేసిన అధికారులు

తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శ్రీకాళహస్తి సమీప లంక మిట్ట ముంపు ప్రమాదంలో ఉంది. దీంతో లంకమిట్ట వాసులను అధికారులు అప్రమత్తం చేశారు.

09:34 December 04

తుపాను దృష్ట్యా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

కృష్ణా జిల్లా వ్యాప్తంగా శీతలగాలులు, చిరుజల్లులు కురుస్తున్నాయి. తుపాను దృష్ట్యా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జాలర్లు వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు.

09:33 December 04

తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో చిరు జల్లులు

ప్రకాశం జిల్లా తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో చిరు జల్లులు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఇవాళ, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తీరప్రాంత ప్రజలను కలెక్టర్ దినేష్ కుమార్ అప్రమత్తం చేశారు. తుపాను దృష్ట్యా ప్రభుత్వ సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. జిల్లా, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

09:32 December 04

తుపాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు

Rains in Chittoor District: తుపాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేటలోని లోతట్టు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరుతోంది. అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద సహాయక చర్యలను సంయుక్త కలెక్టర్ పర్యవేక్షిస్తోన్నారు. జడ్పీ బాలికల పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని జేసీ పరిశీలించారు. తుపాను దృష్ట్యా 'స్పందన' కార్యక్రమం రద్దు చేశారు. చిత్తూరు కలెక్టరేట్‌లో అధికారులు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.

09:32 December 04

తిరుమలలో ఈదురుగాలులతో వర్షం

Heavy Rains in Tirupati: తుపాను ప్రభావంతో తిరుమలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో వర్షం కురుస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది.

09:31 December 04

నైరుతి బంగాళాఖాతంలో వాయవ్య దిశగా కదులుతున్న తుపాను

Cyclone Alert Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో వాయవ్య దిశగా గంటకు 14 కి.మీ వేగంతో తుపాను కదులుతోంది. చెన్నైకి 130 కి.మీ, నెల్లూరుకు 220 కి.మీ దూరంలో, బాపట్లకు 330 కి.మీ, మచిలీపట్నానికి 350 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఇవాళ కోస్తా తీరానికి సమాంతరంగా తుపాను పయనించనుంది. రేపు మధ్యాహ్నం తీవ్ర తుపానుగా మారనుంది. నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

09:31 December 04

బాపట్ల జిల్లాల్లో పాఠశాలలకు 2 రోజులు సెలవు ప్రకటించిన అధికారులు

Rains in Bapatla District: తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో సూర్యలంక బీచ్‌కు సందర్శకులు రావద్దని అధికారుల సూచించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో 'స్పందన' కార్యక్రమం రద్దు చేశారు. బాపట్ల జిల్లాల్లో పాఠశాలలకు 2 రోజులు సెలవు ప్రకటించారు.

09:17 December 04

రేపు తీవ్ర తుపానుగా మారనున్న మిచౌంగ్ తుపాను

Cyclone Michaung News Live Updates Telugu: బంగాళాఖాతం ఏర్పడిన మిచౌంగ్ తుపాను దూసుకొస్తోంది. రేపు మధ్యాహ్నం కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తుపాను తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం ఉండనుంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 110 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.

తుపాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. 1.5 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగసి పడుతున్నాయి. చాలా చోట్ల సముద్రపు నీరు ముందుకు వచ్చింది. తీర ప్రాంతం జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావిత జిల్లాలలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఅర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. తుపాను నేపథ్యంలో పాఠశాలలకు స్థానిక సెలవులు ప్రకటించారు.

Last Updated : Dec 4, 2023, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.