ETV Bharat / bharat

దుబాయ్ నుంచి ఐరన్​ బాక్స్​లో బంగారం స్మగ్లింగ్.. మూడు కేజీలు సీజ్

author img

By

Published : Dec 3, 2022, 11:34 AM IST

ఐరన్ బాక్స్‌లో బంగారాన్ని దాచి అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని బెంగళూరు కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకున్న ఆ వ్యక్తి నుంచి సుమారు 3 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు.

Customs seized 3 kg of gold
Customs seized 3 kg of gold

ఐరన్ బాక్స్‌లో బంగారాన్ని దాచి అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని బెంగళూరు కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకున్న ఆ వ్యక్తి నుంచి సుమారు 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి ఓ 22 ఏళ్ల యువకుడు నవంబర్ 29న దేవనహళ్లి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు.

gold Smuggling in iron box at Bengaluru airport
ఐరన్​ బాక్స్​లో బంగారం

తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు నిందితుడిని చెక్​ చేయగా.. అతని బ్యాగులో అనుమానాస్పద పదార్థాలు కనిపించాయి. దీంతో అనుమానించిన సిబ్బంది అత్యాధునిక స్కానర్‌ ద్వారా మరోమారు తనిఖీ చేయగా.. ఓ ఐరన్‌ బాక్స్‌లోని స్టీల్​ ప్లేట్​ కింద దాచిన బంగారం బయటపడింది. సుమారు రూ.1.60 కోట్ల విలువైన 3015.13 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

gold Smuggling in iron box at Bengaluru airport
కస్ట్​మ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్న ఐరన్​ బాక్స్​
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.