ETV Bharat / bharat

viveka murder case: వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్​కుమార్ రెడ్డి రిమాండ్ జూన్ 2 వరకు పొడిగింపు

author img

By

Published : May 10, 2023, 8:34 PM IST

Updated : May 10, 2023, 8:43 PM IST

viveka murder case: వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు సీబీఐ కోర్టు వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది. రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను అధికారులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణను11వ తేదీకి వాయిదా వేసింది.

viveka murder case
వివేకా హత్య కేసు

YS Bhaskar Reddy, Udaykumar Reddy Judicial remand Extend: వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు సీబీఐ కోర్టు వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరినీ సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను అధికారులు తిరిగి చంచల్​గూడ జైలుకు తరలించారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిని గత నెల 14న, భాస్కర్ రెడ్డిని 16వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరినీ సీబీఐ అధికారులు 6రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్​పై సీబీఐ అధికారులు దాఖలు చేసిన కౌంటర్​పైనా వాదనలు ముగిశాయి.

సీబీఐ కౌంటర్ పిటిషన్.. ఉదయ్ కుమార్ రెడ్డికి వివేకా హత్య గురించి ముందే తెలుసని సీబీఐ అధికారులు కౌంటర్ పిటిషన్​లో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన విషయం బయటకు తెలియక ముందే ఉదయ కుమార్ రెడ్డికి తెలిసిపోయిందని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పిన తర్వాత వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. వైఎస్ వివేకా హత్య జరిగిన ఘటనాస్థలానికి అవినాష్ రెడ్డితో కలిసి వెళ్లి హత్యకు సంబందించిన.. ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించాడని సీబీఐ అధికారులు కౌంటర్ పిటిషన్​లో వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కంపౌండర్​గా పనిచేసే తన తండ్రిని పిలిచి వివేకా తలకు కుట్లు వేయించినట్లు సీబీఐ అధికారులు పిటిషన్​లో పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. వివేకా హత్యకు సంబంధించిన కేస్ డైరీని ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.

సునీత పిటిషన్​: వివేకా హత్య కేసులో సునీత పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ పీపీకి తమ న్యాయవాదులు సహకరించేలా అనుమతించాలని సునీత పిటిషన్​లో కోరారు. సునీత పిటిషన్‌పై గంగిరెడ్డి, సునీల్ యాదవ్ కౌంటర్లు దాఖలు చేశారు. విచారణ ప్రక్రియలో సునీత జోక్యాన్ని అనుమతించవద్దని కోరారు. కౌంటర్లు దాఖలు చేయాలని మిగతా నిందితులకు సీబీఐ కోర్టు ఆదేశించింది. వివేకానందరెడ్డి కుమార్తె సునీత పిటిషన్‌పై విచారణ జూన్ 2కి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు డెడ్​లైన్ వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు డెడ్​లైన్ విదించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 30లోపు ఈ కేసులోని విస్తృత కుట్రకోణంపై దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అనంతరం చోటుచేసుకున్న పరిణామాల కారణంగా సమయం వృథా అయింది. కాబట్టి దర్యాప్తు గడువును జూన్‌ 30కి పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జూన్‌ 30లోగా హత్యకేసుకు సంబందించిన విచారణ పూర్తి చేసేందుకు సీబీఐ వేగంగా పావులు కదుపుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : May 10, 2023, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.