ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 5,910 కరోనా కేసులు.. జపాన్​లో లక్షకు పైనే..

author img

By

Published : Sep 5, 2022, 9:50 AM IST

corona cases
corona cases

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 5,910 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 7,034 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 5,910 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 7,034 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.69 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.12 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,44,62,445
  • క్రియాశీల కేసులు: 53,974
  • మొత్తం మరణాలు: 5,28,007
  • కోలుకున్నవారు: 4,38,80,464

Vaccination In India :
దేశంలో ఆదివారం 32,31,895 కోట్ల మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 213.52 కోట్లకు చేరింది. ఒక్కరోజే 2,27,313 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 618,970 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 2,125 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 601,189,435 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,475,346 మంది మరణించారు. ఆదివారం మరో 587,620 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 586,169,762కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 1,17,130 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మందికిపైగా మరణించారు.
  • దక్షిణ కొరియాలో 72,144 కొవిడ్​ కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి.
  • రష్యాలో 48,042 కొత్త కేసులు, 87 మరణాలు వెలుగుచూశాయి.
  • అమెరికా, తైవాన్, ఇటలీ, ఫ్రాన్స్, హాంకాంగ్, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి

ఇవీ చదవండి:

రికార్డు స్థాయిలో రోడ్డు ప్రమాద మరణాలు.. రోజుకు 426 మంది బలి

'న్యాయవ్యవస్థ నిరాడంబరంగా ఉండాలి.. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.