ETV Bharat / bharat

clash : 9వ తరగతి విద్యార్ధుల ఘర్షణ.. క్లాస్ రూంలోనే కత్తితో దాడి

author img

By

Published : Apr 20, 2023, 1:42 PM IST

Updated : Apr 20, 2023, 10:04 PM IST

clash : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం హైస్కూల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరీక్ష జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థి మరో సహచర విద్యార్థిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

conflict between students
విద్యార్థిని చాకుతో పొడిచిన మరో స్టూడెంట్

clash : పాఠశాల స్థాయిలో విద్యార్థుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. పరస్పరం చాడీలు చెప్పుకోవడం.. తమ దాకా వచ్చిన విద్యార్థులను.. ఉపాధ్యాయులు సర్థి చెప్పి తిరిగి వారిని కలపడం పరిపాటే. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమాల ప్రభావం విద్యార్థుల్లో హింసను ప్రేరేపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం హైస్కూల్​లో జరిగిన ఉదంతం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. తనకు చెల్లెలు వరుసయ్యే బాలికను ప్రేమిస్తున్నాడనే ఆక్రోశంతోనే దాడి జరిగినట్లుగా స్థానికంగా చర్చ జరుగుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజానగరం హైస్కూల్​లో విద్యార్థుల మధ్య పాత కక్షలు కత్తి పోట్లకు దారి తీశాయి. పరీక్ష రాస్తున్న సమయంలో తొమ్మిదో తరగతి విద్యార్థిపై సహచర విద్యార్థి కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు యత్నించిన వారిని కత్తితో బెదిరించి పారిపోయాడు.

రాజానగరం హైస్కూల్​లో.. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం హైస్కూల్​లో వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో పరీక్ష పూర్తవుతుందన్న సమయంలో ఓ విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. విద్యార్థికి గొంతు పై భాగం, మో చేయి వద్ద తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. వెంటనే అడ్డుకునేందుకు సహచర విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు యత్నించగా.. కత్తితో బెదిరించి పారిపోయాడని ఉపాధ్యాయులు తెలిపారు. తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స అనంతరం.. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల సహకారంతో ప్రైవేటు అస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న విద్యార్థి... తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. కాగా విద్యార్థిపై దారుణంగా దాడికి పాల్పడిన ఆ విద్యార్థి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ దాడిపై సమాచారం అందిన వెంటనే ఘటనా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు ప్రస్తుతం.. విద్యార్థుల మధ్య ఘర్షణకు గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు తీవ్ర గాయాలపాలై, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో పాటు విద్యార్థి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. దీంతో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

విష సంస్కృతికి ఆకర్షితులై... గ్రూపు తగాదాలు, వ్యక్తిగత కక్షలు పాఠశాలలకూ పాకాయి. సినిమాలు, సెల్​ఫోన్ల ప్రభావం అభం, శుభం ఎరుగని చిన్నారుల్లో విద్వేషం రగిలేందుకు కారణమవుతున్నాయి. పాఠశాల స్థాయిలోనే గ్రూపులు ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయలపై కామెంట్లు, విద్యార్థినిలపై దాడుల సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. సినిమాల్లో హీరోలు, వారు చెప్తున్న డైలాగుల పట్ల సులువుగా ఆకర్షితులవుతున్న విద్యార్థులు.. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోవడం లేదు. అనుకున్న వెంటనే అన్నీ అందాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. విద్యార్థుల్లో విపరీత ధోరణి పెరిగిపోవడానికి స్థానిక పరిస్థితుల ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటోందని మానసిక నిపుణులు చెప్తున్నారు. లైఫ్ అంటే స్టోరీ కాదు.. రీల్స్ మాదిరిగా ఉండాలని నేటి యువత భావిస్తోంది... జీవితం, అనుభవాల గురించి చెప్తే వినేంత ఓపిక కూడా వారికి ఉండడం లేదని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 20, 2023, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.