బాల్య వివాహాల వల్ల రోజుకు 60మంది బాలికలు బలి!

author img

By

Published : Oct 11, 2021, 8:11 PM IST

Child marriage kills more than 60 girls a day

బాల్యవివాహాల కారణంగా రోజుకు ప్రపంచవ్యాప్తంగా 60మంది బాలికలు మరణిస్తున్నట్లు ఓ నివేదికలో తేలింది. దక్షిణ ఆసియా ప్రాంతంలో సగటున ఆరుగురు చిన్నారులు మరణించినట్టు వెల్లడైంది. ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను 'సేవ్​ ది చిల్డ్రన్​' విడుదల చేసింది.

చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల ఏటా 22వేల మంది బాలికల జీవితాలు చిధ్రమవుతున్నట్లు 'సేవ్​ ది చిల్డ్రన్' నివేదిక తెలిపింది. బాల్య వివాహాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజుకు 60మంది మరణిస్తున్నట్లు వెల్లడించింది. దక్షిణ ఆసియా ప్రాంతంలో రోజుకు ఆరుగురు చిన్నారులు చనిపోతున్నారనే ఆందోళనకర విషయాన్ని నివేదికలో పేర్కొంది.

చిన్న వయసులోనే గర్భం దాల్చడం, కాన్పులు కావడం వల్ల ఇన్ని వేల మరణాలు సంభవిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను విడుదల చేసింది 'సేవ్​ ది చిల్డ్రన్'.

నివేదికలోని కీలక విషయాలు..

  • బాల్యవివాహ సంబంధిత కారణాల వల్ల దక్షిణాసియాలో ఏటా 2000మంది బాలికలు చనిపోతున్నారు. తూర్పు ఆసియా, పసిఫిక్​ ప్రాంతాల్లో 650మంది చొప్పున మరణిస్తున్నారు. లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల్లో ఆ సంఖ్య 560గా ఉంది.
  • పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో అత్యధికంగా 9,600మంది బాలికలు బాల్య వివాహాలకు బలవుతున్నారు. ప్రపంచంలోని బాధితుల్లో సగం మంది ఈ ప్రాంతాలకు చెందినవారే. ఇక్కడ సగటున రోజుకు 26మంది బాలికలు మృత్యువాత పడుతున్నారు.
  • గత 25 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల బాల్యవివాహాలను నివారించగలిగారు. కానీ కరోనా పాండెమిక్ తర్వాత అవాంతరాలు ఏర్పడి పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారాయి.
  • 2030 నాటికి కోటి మంది బాలికలు బాల్యవివాహాల బారినపడే అవకాశం ఉంది.

99శాతం పోక్సో నేరాలు బాలికలపైనే..

2020లో పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో 99 శాతం మంది బాధితులు బాలికలేనని జాతీయ నేర గణాంకాల సంస్థ(NCRB) వివరాలు వెల్లడిస్తున్నట్లు చైల్డ్ రైట్స్ అండ్ యూ(CRY) ఎన్జీవో తెలిపింది. ఈ మేరకు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నివేదిక విడుదల చేసింది. పోక్సో చట్టం కింద గతేడాది నమోదైన 28,327 కేసుల్లో 28,058 కేసులు బాలికలపై నేరాలకు సంబంధించినవేనని పేర్కొంది.

అత్యధికంగా 16 నుంచి 18 ఏళ్ల మధ్యవయసున్న బాలికలపైనే నేరాలు జరుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. మొత్తం పోక్సో కేసుల్లో ఇవే సగం(14,092) ఉన్నట్లు చెప్పింది. కరోనా కారణంగా బాలికలపై తీవ్ర ప్రభావం పడిందని, బాల్య వివాహాలు, లైగింక వేధింపులు, హింస ఆందోళనకర స్థాయిలో పెరిగినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: ఆదివాసి యువతిపై ఏడాదిగా అత్యాచారం- గర్భంలోని శిశువును...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.