ETV Bharat / bharat

పానీపూరి చేసి పెట్టిన సీఎం- టూరిస్టులు ఫిదా

author img

By

Published : Jul 12, 2022, 8:41 PM IST

Mamata Makes Panupuri: కొందరు పర్యటకులకు అరుదైన అవకాశం దక్కింది. డార్జిలింగ్​కు పర్యటనకు వెళ్లిన వారిలో కొందరికి స్వయంగా పానీపూరి చేసి వడ్డించారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ.

Chief Minister Mamata makes fuchka Panupuri for tourists
Chief Minister Mamata makes fuchka Panupuri for tourists

పానీపూరి చేసి పెట్టిన సీఎం

Mamata Makes Panupuri: బంగాల్​లోని డార్జిలింగ్​కు వెళ్లిన పర్యటకుల్లో కొందరికి అరుదైన అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన పానీపూరిని వారంతా రుచిచూశారు. నాలుగు రోజుల ఉత్తర బంగాల్​ పర్యటనలో ఉన్న మమత.. మంగళవారం అనూహ్యంగా రోడ్డు పక్కనున్న ఓ దుకాణం వద్ద ఆగారు. అక్కడ ఉన్నవారికి స్వయంగా పానీపూరి చేసి వడ్డించారు. అక్కడి వారితో కాసేపు మాట్లాడారు. మమత పానీపూరి రుచి చూసిన వారిలో స్థానికులతో పాటు భారత్​లోని వేర్వేరు రాష్ట్రాల పర్యటకులతో పాటు బంగ్లాదేశ్​కు చెందిన కొందరు చిన్నారులు కూడా ఉన్నారు.

Mamata Makes Panupuri:
పానీపూరి చేస్తున్న బంగాల్​ సీఎం

గతంలో మమత ఇదే తరహాలో ఓ దుకాణంలో మోమోలు చేసి, అక్కడి వారికి రుచి చూపించారు. ఆ దుకాణం నడుపుతున్న స్వయం సహాయక బృందంలోని మహిళతో మాట్లాడారు. శాశ్వత దుకాణం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా అధికారులు ఆమెకు కొత్త దుకాణం ఏర్పాటు చేయించారు. ఇప్పుడు అదే దుకాణానికి మమత వెళ్లి పానీపూరి చేసి పెట్టారు.

Mamata Makes Panupuri:
పానీపూరి వడ్డిస్తున్న సీఎం

ఇవీ చూడండి: 'జాతీయ చిహ్నాన్నీ మార్చేస్తారా? ఇదేం పద్ధతి మోదీజీ..??'

30 సెకన్లలో 10 చెంప దెబ్బలు.. హోంవర్క్ చేయని చిన్నారిపై టీచర్ కర్కశత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.