ETV Bharat / bharat

Cheetah Trapped in a Cage in Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 6:39 AM IST

Updated : Sep 20, 2023, 9:33 AM IST

cheetah_trapped_in_a_cage_in_Tirumala
cheetah_trapped_in_a_cage_in_Tirumala

06:34 September 20

అలిపిరి కాలిబాట మార్గంలో బోనులో చిక్కిన ఆరో చిరుత

Cheetah Trapped in a Cage in Tirumala: తిరుమలలో మరో‌ చిరుతపులి చిక్కింది. అలిపిరి నడకమార్గంలోని లక్ష్మీనరసింహ ఆలయం వద్ద అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. మంగళవారం అర్థరాత్రి చిక్కిన ఈ చిరుతతో జూన్ 23 నుంచి కలిపి మొత్తం.. 6చిరుత పులులను అటవీశాఖ అధికారులు బంధించారు. ఇప్పుడు చిక్కిన ఈ చిరుతను కూడా అటవీ శాఖ సిబ్బంది జూపార్క్​కు తరలించనున్నట్లు వివరించారు. గతంలో చిన్నారిపై దాడి చేసిన ప్రాంతంలోనే ప్రస్తుతం చిరుత చిక్కింది.

Another Leopard in Tirumala : తిరుమలలో మరో చిరుత.. మళ్లీ అక్కడే.. ట్రాప్ కెమెరాల్లో కదలికలు

ప్రస్తుతం చిక్కిన చిరుత రక్త నమూనాలను, లాలాజాలాన్ని సేకరించి పరిశోధనకు పంపించనున్నట్లు అధికారులు వివరించారు. గతంలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి నమూనాలతో క్రోడికరించి వైద్య పరీక్షలు చేయించనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన 6సంవత్సరాల చిన్నారిపై చిరుత దాడితో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే చిన్నారిపై చిరుత దాడి చేసిన ప్రాంతంలోనే అధికారులు కెమెరాలను ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే.

Operation Chirutha in Tirumala: తిరుపతిలో 'ఆపరేషన్​ చిరుత'.. మిగిలిన వాటి కోసం అన్వేషణ

ఈ కెమెరాల ద్వారా అటవీశాఖ అధికారులు వన్యప్రాణులు, కృూరమృగాల వంటి వాటి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వాటి కదలికలను గమనించిన చోట ఇలా బోనులను ఏర్పాటు చేసి పట్టుకుంటున్నారు. అయినప్పటికీ.. పదే పదే చిరుత సంచారంతో కాలినడకన స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు.. వీటి సంచారంతో ఆందోళన చెందుతున్నారు.

గతంలో చిన్నారిపై చిరుత దాడి చేసి ప్రాణాలు బలి తీసుకోవటంతో తిరుమలకు వెళ్లే భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాత్రి సమయంలో చిన్నారిపై చిరుత దాడి చేసి.. అటవీలోకి లాక్కెల్లగా మరుసటి రోజు ఉదయం చిన్నారి విగతా జీవిగా దర్శనమిచ్చింది. దీంతో అధికారులు చిరుతల సంచారంపై దృష్టి సారించారు. చిన్నారిపై దాడి చేసిన ప్రాంతంలోనే అప్పుడు అధికారులు బోనులు ఏర్పాటు చేయగా.. ఇలా ఆ బోనుల్లో చిరుతలు చిక్కుతున్నాయి. మొదట ఓ చిరుత చిక్కగా.. తర్వాత మరో నాలుగు చిక్కాయి. ప్రస్తుతం ఇంకో చిరుత చిక్కటంతో ఆ సంఖ్య 6కు చేరింది.

ఆపరేషన్​ చిరుత పేరుతో కాలినడక మార్గంలో భక్తులకు చిరుతపులుల నుంచి రక్షణ కల్పించేందుకు అధికారులు బోనులను ఏర్పాటు చేసి.. వాటిని బంధించే ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాటు నెల్లూరు జిల్లా చిన్నారి దాడి సమయం నుంచే ప్రారంభం కాగా ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఓ చిరుత కదలికలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Another Leopard Trapped in Cage at Tirupati: తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత..

Last Updated :Sep 20, 2023, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.