ETV Bharat / bharat

Chandrababu Naidu Letter to ACB Court Judge: నన్ను అంతమొందించేందుకు కుట్ర.. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 11:59 AM IST

Updated : Oct 27, 2023, 12:37 PM IST

Chandrababu Naidu Letter to ACB Court Judge: తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జైలు అధికారుల ద్వారా 3 పేజీల లేఖను పంపారు.

Chandrababu Naidu Letter to ACB Court Judge
Chandrababu Naidu Letter to ACB Court Judge

Chandrababu Naidu Letter to ACB Court Judge: ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా లేఖ పంపిన చంద్రబాబు.. రాజమండ్రి జైలులో నాకు ప్రాణహాని ఉందని.. జెడ్‌ ప్లస్ కేటగిరి రక్షణలో ఉన్న తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారన్నారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈనెల 25న ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి 3 పేజీల లేఖను చంద్రబాబు పంపారు.

పోలీసులే లీక్ చేశారు: జైలులో ఇటీవల కొన్ని ఘటనలు తన భద్రతపై అనుమానాలకు తావిస్తున్నాయని.. తాను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారని.. జైలులో తాను ప్రవేశిస్తున్న వీడియోలు, ఫొటోలను స్వయంగా పోలీసులే లీక్ చేశారని లేఖలో తెలిపారు. ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. అధికార పార్టీ వారు కావాలని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారన్న చంద్రబాబు.. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. భద్రతపై భయాలను గాలికి వదిలేసి, తన ప్రాణాలను ముప్పులో పెట్టారని వెల్లడించారు.

Chandrababu letter to Telugu people : నేను జైలులో లేను.. ప్రజల హృద‌యాల్లో ఉన్నా: చంద్రబాబు

అజ్ఞాత లేఖ: తన ప్రాణాలకు హాని ఉందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఒక అజ్ఞాత లేఖ కూడా వచ్చిందన్న చంద్రబాబు.. లేఖపై ఇప్పటివరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపించారు. అజ్ఞాత లేఖలో వామపక్ష తీవ్రవాదులు తన హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారని.. కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఎస్పీకి రాసిన లేఖలో ఉందని అన్నారు. ఆ లేఖకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి విచారణ చేయలేదని.. అనుకోని ఘటనల నివారణకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

ఖైదీల వల్ల భద్రతకు తీవ్ర ముప్పు: జైలులో అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. జైలులోకి కొందరు దుండగులు గంజాయిపొట్లాలు జైల్లో లోపలికి విసురుతున్నారని పేర్కొన్నారు. గంజాయిపొట్లాలను గార్డెనింగ్ విధుల్లో ఉన్న ఖైదీలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మొత్తం 2200మంది ఖైదీలలో.. 750 మంది వివిధ డ్రగ్స్ కేసుల్లో నిందితులు అని.. జెడ్‌ ప్లస్ కేటగిరి రక్షణలో ఉన్న తన భద్రతకు ఇది చాలా తీవ్రమైన ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఖైదీల వల్ల తన భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని వివరించారు.

Chandrababu Suffering from Severe Health Issues: ఆందోళన కలిగిస్తున్న చంద్రబాబు ఆరోగ్య సమస్యలు.. నడుం కింది వరకు విస్తరించిన దద్దుర్లు

కదలికలు తెలుసుకోవడానికి అజ్ఞాతవ్యక్తులు: డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఒక ఖైదీ జైలులో పెన్‌ కెమెరాతో సంచరిస్తున్నాడని లేఖలో తెలియజేశారు. ఎస్‌కోటకు చెందిన ఆ ఖైదీ పెన్‌ కెమెరాతో జైలు లోపలి ఫొటోలు తీస్తున్నాడని అన్నారు. తన కదలికలు తెలుసుకోవడానికి అజ్ఞాతవ్యక్తులు.. ములాఖత్‌లో తనను కలిసిన వారి చిత్రాల కోసం ఈనెల 6వ తేదీన సెంట్రల్ జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ ప్రయోగించారన్న చంద్రబాబు.. జైలుపై డ్రోన్ ఎగురవేసింది అధికార పార్టీకి చెందిన వారే ఏమోనని అనుమానం వ్యక్తం చేశారు. వారు ఎగురవేసిన డ్రోన్ ఓపెన్ జైలు పరిసరాల వద్దకు వచ్చిందని.. పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని లేఖలో రాశారు. డ్రోన్ ఎగురవేసిన ఘటనలో ప్రధాన సూత్రధారి ఎవరో ఇంతవరకు గుర్తించలేదని..డ్రోన్ ఘటన జైలు అధికారుల నిస్సహాయతను అందరికీ తెలియజేస్తోందని స్పష్టం చేశారు.

కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం: తనతో పాటు తన కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందని.. నాలుగున్నరేళ్లలో అధికార పార్టీ తనపై అనేకసార్లు భౌతికదాడికి యత్నించిందని.. తన భద్రత తీవ్ర ప్రమాదంలో ఉందనేందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత సీఎం, అధికార పార్టీ నాయకుల చర్యల వల్ల తన భద్రతపై అనుమానం ఉందన్న చంద్రబాబు.. వైసీపీ అధికారంలోకి రాగానే 2019లోనే తన భద్రతను తగ్గించే యత్నం చేశారని గుర్తు చేశారు.

Chandrababu Health Update: "చంద్రబాబు కంటికి చికిత్స చేయాలని ప్రభుత్వ వైద్యుల నివేదిక.. కానీ.."

ఫిర్యాదు చేసినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు: వివిధ పర్యటనల్లో తనపై రాళ్లు విసిరితే డీజీపీ దానిని సమర్థించారని.. ఈ ఏడాది నందిగామ, యర్రగొండపాలెం పర్యటనల్లో తన భద్రతాధికారులు గాయపడ్డారని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల మద్దతుతో జరిగిన ఈ రాళ్లదాడిలో రక్తపు గాయాలయ్యాయన్నారు. అదే విధంగా సాగునీటి ప్రాజెక్టులపై విధ్వంసం పర్యటనలో సైతం దాడులకు తెగబడ్డారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని వెల్లడించారు.

ఈ సంఘటనలన్నీ భద్రతా ఏర్పాట్లలో లోపాలను బహిర్గతం చేస్తున్నాయన్న చంద్రబాబు.. జడ్‌ ప్లస్‌ భద్రతకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాని ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. జైలు చుట్టుపక్కల పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరుతున్నానని అన్నారు.

Chandrababu expressed doubts about security in jail: జైల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు..

Last Updated :Oct 27, 2023, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.