ETV Bharat / bharat

chandrababu: ఎన్డీఏ విధానాలపై వ్యతిరేకత లేదు.. ప్రత్యేకహోదా కోసమే బయటికొచ్చాం: చంద్రబాబు

author img

By

Published : Apr 25, 2023, 4:41 PM IST

Updated : Apr 25, 2023, 5:34 PM IST

cbn
చంద్రబాబు

16:23 April 25

'టైమ్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌: ది నీడ్‌ టు కీప్ ఫైటింగ్‌' అంశంపై సదస్సు

chandrababu: ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ నిర్వహించే సమ్మిట్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. టైమ్ అఫ్ ట్రాన్స్ఫర్మేషన్.. ది నీడ్‌ టు కీప్ ఫైటింగ్‌ ఫైటింగ్ అనే అంశంపై రిపబ్లిక్ టీవీ రెండు రోజుల సమ్మిట్ నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్ లో వివిధ సెషన్స్ లో ..ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, పలు రంగాల నిపుణులు, ప్రముఖులు పాల్గొననున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ విజన్ -2047.. ప్రభుత్వ పాలసీలు..జనాభా నిష్పత్తి - యువత పాత్ర, గుడ్ గవర్నెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం-మద్దతు ధరలు, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై చంద్రబాబు సమ్మిట్ లో మాట్లాడారు. ఈ సందర్బంగా మోదీ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.

'టైమ్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌: ద నీడ్‌ టు కీప్ ఫైటింగ్‌' అంశంపై జరిగిన సదస్సలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ అభివృద్ధి విధానాలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని చంద్రబాబు వెల్లడించారు. గతంలో ప్రత్యేకహోదా సెంటిమెంట్‌ వల్లే ఎన్డీఏ నుంచి బయటికొచ్చినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్టీయే కు మద్దతు ఇచ్చే అంశంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏలో భాగస్వామి అవుతారా అంటూ రిపబ్లిక్‌ టీవి అడిగిన ప్రశ్నకు ఇట్స్‌ ఏ మేటరాఫ్ టైమ్ అంటూ సమాధానం ఇచ్చారు. దేశాభివృద్ధి వేరు.. రాజకీయాలు వేరన్న ఆయన, పార్టీలు వేరైనా.. విజన్ ఉన్న నేతలుగా ప్రధాని మోదీ, తాను మాట్లాడుకున్నామన్నారు. ప్రతి రాజకీయ పార్టీ దేశాభివృద్ధి కోసం పని చేయాలని స్పష్టం చేశారు. సంపద సృష్టి.. పేదరిక నిర్మూలన రెండూ ముఖ్యమని, సాంకేతికత తోనే ఈ రెండూ సాధ్యమని తేల్చి చెప్పారు. ప్రధాని ఏ ఆలోచనతో ఉన్నారో.. తానూ అదే ఆలోచనతో ఉన్నానని, దేశాభివృద్ధి కోసం.. తెలుగువాళ్లం కోసం తాను తన పరిధిలో పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రధాని విజనుతో పూర్తిగా ఏకీభవిస్తున్నాన్న చంద్రబాబు, అభివృద్ధి విషయంలో ఆయన ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేయడానికి సిద్దమని తెలిపారు. భారతదేశ బలమేంటో.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నారని ప్రశంసించారు. గతంలో కూడా తాను మోదీ పాలసీలను వ్యతిరేకించలేదని గుర్తుచేశారు.

విజన్ 2020 హైదరాబాదులో సాకారమైంది: ప్రత్యేక హోదా సెంటిమెంటుగా మారిందని, దాని మీద మాత్రమే తాను అప్పట్లో పోరాడానని వెల్లడించారు. పేదరికం లేని సమాజంలో భాగంగా ప్రతి ఒక్కర్నీ ఎగువ మధ్య తరగతి కుటుంబ స్థాయికి చేర్చే ప్రయత్నం చేస్తానని తేల్చిచెప్పారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పాలసీని రూపొందిస్తున్నామన్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాల ఆర్ధికాభివృద్ధి కోసం మెంటర్సును సిద్దం చేయాలనే ఆలోచనతో ఉన్నామని వివరించారు. తాను విజన్ 2020 అంటే.. తనను 420 అంటూ విమర్శలు చేశారని, కానీ తన విజన్ 2020 హైదరాబాదులో సాకారమైందన్నారు. సమాజం కోసం పని చేసే ముందు చూపుతో పని చేసే నేతలు ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారని చెప్పారు. గతంలో నన్ను ప్రతిపక్షాలు విమర్శించేవి.. ఇప్పుడూ అలాగే విమర్శలు వస్తున్నాయన్నారు. ఈ సమ్మిట్ లో వివిధ సెషన్స్ లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, పలు రంగాల నిపుణులు, ప్రముఖులు పాల్గొననున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 25, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.