ETV Bharat / bharat

ఆ రోజు నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు

author img

By

Published : Nov 8, 2021, 7:16 PM IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలు(Parliament Winter Session 2021) నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సిఫార్సు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొవిడ్ నిబంధనల మధ్య సమావేశాలు జరగనున్నాయి.

Winter Session
పార్లమెంటు శీతాకాల సమావేశాలు

నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను(Parliament Winter Session 2021) నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సిఫార్సు చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని సీసీపీఏ కమిటీ ఈ తేదీలను సిఫార్సు చేసినట్లు పేర్కొన్నాయి.

కరోనా దృష్ట్యా..

కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంలో నిర్వహించినట్లుగానే కొవిడ్-19 నిబంధనల మధ్య సమావేశాలు జరగనున్నాయి. కరోనా కారణంగా గతేడాది శీతాకాల సమావేశాలు(Parliament Winter Session 2021) నిర్వహించలేదు. రాజ్యసభ, లోక్​సభ సభ్యులు కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సమావేశాలకు ముందు సభ్యులు కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో..

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈసారి సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరుగుదల(Fuel Hike India), కశ్మీర్​ ప్రజలపై ఉగ్రవాదుల కాల్పులు, లఖింపుర్ ఖేరీ ఘటన(Lakhimpur Kheri News), రైతు చట్టాల రద్దు(Farmers Protest News).. తదితర సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించనున్నాయి.

ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు మొత్తం పెగసస్​ వ్యవహారం, రైతు చట్టాల రద్దుపైనే నడిచాయి.

ఇదీ చూడండి: సీబీఐ అభ్యర్థనల 'పెండింగ్'​పై సుప్రీంకోర్టు అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.