Avinash Reddy vs CBI: అవినాష్​ను అరెస్ట్ చేస్తారని ప్రచారం.. క్షణక్షణం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ

author img

By

Published : May 22, 2023, 6:14 AM IST

Updated : May 22, 2023, 9:23 PM IST

Avinash Reddy
Avinash Reddy ()

06:06 May 22

ఎస్పీతో సీబీఐ చర్చలు.. లొంగిపోవాలని అవినాష్ కు చెప్పాలని సూచన

Avinash Reddy vs CBI: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని.. అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో....కర్నూలులో వేకువజామునుంచే తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. కర్నూలులో తల్లితో పాటు ఆసుపత్రిలో ఉన్న అవినాష్‌రెడ్డిని లొంగిపోయేలా చూడాలంటూ సీబీఐ అధికారులు.. జిల్లా ఎస్పీతో చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి వద్దకు భారీగా అవినాశ్‌రెడ్డి అనుచరులు చేరుకొని హల్‌చల్‌ చేస్తున్నారు. అదే సమయంలో అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీం వెకేషన్ బెంచ్ నిరాకరించింది. ఇవాళ విచారణకు నిరాకరించినా... మంగళవారం మరోసారి సుప్రీం వెకేషన్ బెంచ్ ముందుకెళ్లాలనే యోచనలో అవినాష్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య క్షణక్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఎస్పీని కలిసిన సీబీఐ అధికారులు: తల్లి అనారోగ్యం దృష్ట్యా విచారణకు రాలేనని తాజా నోటీసులకు సమాధానం ఇచ్చిన అవినాశ్‌రెడ్డిని...సీబీఐ అరెస్టు చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఉదయమే ఆరుగురు సీబీఐ అధికారులు కర్నూలు చేరుకోవడం....ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో.. సీబీఐ అధికారులు చర్చించారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా అవినాష్ రెడ్డి లొంగిపోయేలా.. చూడాలని చెప్పారు. అనంతరం అవినాష్ తల్లి చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లారు. సీబీఐ అధికారులు వచ్చారని తెలిసి.. అప్పటికే అవినాష్ అనుచరులు భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున వైకాపా శ్రేణులు గుమికూడటంతో, ఆస్పత్రి వద్దకు వెళ్లిన అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

అవినాష్ అనుచరులు: సీబీఐ అధికారులు రాకతో వైసీపీ శ్రేణులు భారీగా ఆసుపత్రికి వద్దకు చేరిన పరిస్థితుల్లో, పోలీసులు ఆసుపత్రి వద్ద బలగాలను దించారు. నలువైపులా బారికేడ్లు పెట్టారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఎస్పీని కలిసిన సీబీఐ అధికారులు.. లొంగిపోవాలని అవినాష్ కు చెప్పాలని మరోసారి కోరారు. డీజీపీ సలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ కృష్ణకాంత్ వారికి చెప్పారు. ఆసుపత్రి వద్ద ఉన్న అవినాష్ అనుచరులు వెళ్లిపోకుండా..వైసీపీ ఎమ్మెల్యేలు వారికి అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు. సీబీఐ అధికారుల రాకకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లలతో నిరసన తెలిపారు


ముందస్తు బెయిల్ పిటిషన్: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు సుప్రీం వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మెన్షనింగ్ లిస్టులో ఉంటేనే విచారణ చేస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం స్పష్టంచేసింది. దీనికోసం మెన్షనింగ్ అధికారి ముందుకెళ్లాలని ధర్మాసనం సూచించింది. గతంలోనూ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అవినాష్ రెడ్డి హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశించాలని కోరారు. గత పిటిషన్ విచారణ తేదీని ఖరారు చేయని సుప్రీంకోర్టు జూన్ రెండో వారంలో విచారణకు అనుమతిస్తామని స్పష్టంచేసింది. సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తాజాగా అవినాష్ తరపు న్యాయవాదులు మెన్షన్ చేశారు. ఇవాళ విచారణకు నిరాకరించినా మంగళవారం మరోసారి సుప్రీం వెకేషన్ బెంచ్ ముందుకెళ్లాలనే యోచనలో అవినాష్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.


ఈనెల 27వ తేదీ వరకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐకి లేఖ రాశారు. తన ముందస్తు బెయిలు పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని లేఖలో ప్రస్తావించారు. అందుకే ఈనెల 27వ తేదీ వరకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన తల్లి ఛాతి నొప్పితో బాధ పడుతున్నారని... ఆమెను చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈనెల 27వ తేదీ వరకు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కర్నూలులో సీబీఐ అధికారులు మకాం వేసి... జిల్లా ఎస్పీతో చర్చలు జరుపుతున్న తరుణంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెకేషన్ బెంచ్ లో మంగళవారం పిటిషన్ విచారణకు వస్తుందనే ఆశతో ఈమేరకు సీబీఐ అధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. మరోవైపు కేంద్ర బలగాల సాయంతో అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం సాగుతోంది.

ఇవీ చదవండి :

Last Updated :May 22, 2023, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.