ETV Bharat / bharat

'హెలికాప్టర్​ వల్లే నా గేదె చనిపోయింది'.. పైలట్​పై వృద్ధుడి ఫిర్యాదు

author img

By

Published : Nov 14, 2022, 9:36 AM IST

Updated : Nov 14, 2022, 11:36 AM IST

హెలికాప్టర్​ శబ్దంతో తన గేదె చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడో వృద్ధుడు. ఈ ఘటన రాజస్థాన్​లోని అల్వార్ జిల్లాలో జరిగింది. ఇంతకీ ఏమైందంటే..

Application Against Helicopter Pilot
Application Against Helicopter Pilot

రాజస్థాన్​లోని అల్వార్​లో వింత ఘటన జరిగింది. హెలికాప్టర్​ శబ్దం వల్లే తన గేదె చనిపోయిందని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడో వృద్ధుడు. దీనిపై స్పందించిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామన్నారు.

ఇదీ జరిగింది.. అల్వార్​ జిల్లా బహ్​రోడ్​ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జీత్​ యాదవ్ వస్తున్నారని కార్యకర్తలు ఆయన్ని స్వాగతించడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే హెలికాప్టర్​ నుంచి తమ ప్రియతమ నాయకుడిపై పూల వర్షం కురిపించాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే ఆదివారం హెలికాప్టర్ నుంచి ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించారు. అయితే ఆ హెలికాప్టర్​ బహ్​రోడ్​ ప్రాంతంలో కొన్నిసార్లు చక్కర్లు కొట్టింది. అనంతరం కోహ్రానా అనే గ్రామం మీదుగా వెళ్లింది. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల పెద్ద శబ్దం వచ్చింది. దాంతో రూ.1.5 లక్షల విలువైన గేదె మృతిచెందిందని ఆ గ్రామానికి చెందిన బల్వీర్ అనే వృద్ధుడు ఆరోపించాడు. అనంతరం హెలికాప్టర్ పైలట్ నిర్వాకంపై ఆగ్రహించిన బల్వీర్​.. అతడిపై పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చనిపోయిన గేదెను పరీక్ష నిమిత్తం వెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. పరీక్ష నివేదిక అనంతరం.. గేదె ఎలా చనిపోయిందో తెలుస్తుందని.. దాని ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Application Against Helicopter Pilot
ఫిర్యాదు పత్రం

ఇవీ చదవండి : తాను చనిపోయి మరో ఇద్దరిని బతికించిన 18 నెలల చిన్నారి.. చిన్న వయసులోనే అవయవదానం

డిటోనేటర్లతో రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు.. పట్టాలకు పగుళ్లు.. తప్పిన పెను ప్రమాదం

Last Updated : Nov 14, 2022, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.