ETV Bharat / bharat

సహచరుడి కాల్పుల్లో ఐదుగురు బీఎస్​ఎఫ్​ జవాన్లు మృతి

author img

By

Published : Mar 6, 2022, 1:17 PM IST

BSF Jawan Killed: అమృత్​సర్​లోని బీఎస్​ఎఫ్​ క్యాంప్​లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సహచరుడే జవాన్లపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

BSF Jawan Killed
బీఎస్​ఎఫ్​ కాల్పులు

BSF Jawan Killed: పంజాబ్‌ అమృత్‌సర్‌లోని బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్​ తీవ్రంగా గాయపడ్డారు. కాసా ప్రాంతంలోని భోజనశాలలో ఓ జవాను ఈ కాల్పులకు పాల్పడ్డాడు.

కాల్పులు జరిగిన ప్రాంతం ‌అట్టారి-వాగా సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాల్పుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.