ETV Bharat / bharat

మైనర్ కుమార్తెపై పెద్దనాన్న అత్యాచారం.. ఇన్ఫార్మర్ అనే నెపంతో వ్యక్తిని హత్య చేసిన నక్సల్స్

author img

By

Published : Jan 2, 2023, 7:46 AM IST

Updated : Jan 2, 2023, 9:33 AM IST

మైనర్​ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. మర్మాంగాల్లో నొప్పి భరించలేక బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. మరోవైపు ఛత్తీస్​గఢ్​లో నక్సలైట్లు కలకల సృష్టించారు. ఓ వ్యక్తిని చంపి.. రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ఇక, అదే జిల్లాలో నలుగురు కనిపించ కుండా పోయారు. ఈ విషయంలో నక్సలైట్లపై అనుమానం వ్యక్తం చేశారు.

rape with minor girl in bhopal
rape with minor girl in bhopal

ఓ బాలికపై ఆమె పెద్దనాన్నే లైంగిక దాడి చేశాడు. వరసకు కూతురు అయ్యే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో జరిగింది. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాటిబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ మహిళ ఉమ్మడి కుటుంబంతో నివాసం ఉంటోంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆ మహిళ భర్త ఆరు నెలల క్రితమే చనిపోయాడు. దీంతో ఇళ్లలో పనిమనిషిగా చేసుకుంటూ అత్తవారింట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటోంది. కాగా, గురువారం రాత్రి తన చిన్న కుమార్తె ఏడుస్తూ కనిపించింది. ఎంత ఓదార్చినా ఏడుపు ఆపలేదు. ఆ బాలిక తన మర్మంగాల్లో నొప్పి వస్తోందని ఏడుస్తూనే ఉంది. దీంతో ఆ మహిళ తన కుమార్తె మర్మాంగాలను పరిశీలించి.. బాలికను ఏం జరిగిందని అడిగింది. దీంతో, పెద్దనాన్న తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక. దీంతో ఆ మహిళ తన కుమార్తెతో పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడు పరార్...
చైల్డ్​ హెల్ప్​లైన్​ ద్వారా పోలీసులు బాలికకు కౌన్సెలింగ్​, వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రేప్​ కేసు నమోదు చేశారు. కాగా, తనపై కేసు నమోదైన విషయం తెలియగానే నిందితుడు పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఛత్తీస్​గఢ్​లో నక్సలైట్ల కలకలం..
ఛత్తీస్​గఢ్​లో మరోసారి నక్సలైట్ల చర్య కలకలం రేపింది. పోలీస్​ ఇన్ఫార్మర్​ అనే నెపంతో బీజాపుర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సంజయ్​ అనే వ్యక్తి(25)ని ఎత్తుకెళ్లారు. అనంతరం అతడిని హతమార్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. కాగా, రోడ్డు పక్కన పడివున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు.. జాగర్​గుండా ప్రాంతానికి చెందిన నక్సటైట్​ కమిటీ బాధ్యత వహించిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. నిందితులను పట్టుకోడానికి ఆపరేషన్​ మొదలు పెట్టినట్లు జిల్లా ఎస్పీ ఆంజనేయ వర్షే తెలిపారు.

నలుగురు అదృశ్యం..
మరోవైపు, బీజాపుర్​ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలోని రోడ్డు కాంట్రాక్టర్​తో పాటు ముగ్గురు వ్యక్తులు గత తొమ్మిదిరోజులుగా కనిపించడం లేదు. వారిని నక్సలైట్లే అపహరించి ఉండొచ్చని బాధితుల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, ఈ విషయంపై అధికారికంగా జిల్లా యంత్రాంగం స్పందించలేదు. అయితే, బాధిత కుటుంబాలు ఈటీవీ భారత్​తో మాట్లాడాయి. తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? వారు క్షేమంగా తిరిగి వస్తారా? లేదా అని ఆవేదన వ్యక్తం చేశాయి. ఒకవేళ తమ కుటుంబ సభ్యులు నక్సలైట్లు​ అదుపులోకి తీసుకుంటే.. వారిని క్షేమంగా వదిలిపెట్టాలని కోరారు. కాగా, తొమ్మిది మంది కనిపించకుండా పోయినట్లు తమకు మీడియా ద్వారా తెలిసిందని జిల్లా ఎస్పీ చెప్పారు. కనిపించకుండా పోయిన వారిలో కొండగాన్​కు చెందిన నిమేంద్ర కుమార్ దివాన్​, నీల్​చంద్​ నాగ్​, లోహండి గూడకు చెందిన తెమ్రూ నాగ్​, బసూర్​కు చెందిన చప్ది భాటియాలు ఉన్నారు.

Last Updated : Jan 2, 2023, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.