ETV Bharat / bharat

అజాగ్రత్తగా ఉంటే ప్రమాదంలో పడతారు: మోదీ

author img

By

Published : Oct 20, 2020, 1:10 PM IST

Updated : Oct 20, 2020, 7:02 PM IST

prime-minister-narendra-modi-will-be-sharing-a-message-for-citizens-at-6-pm-today
సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

19:00 October 20

కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రజలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. వైరస్​ పోయిందని, ప్రమాదం లేదని అనుకోవద్దని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయని గుర్తు చేశారు.

కరోనా వ్యాక్సిన్​ వచ్చిన వెంటనే ప్రతి భారతీయుడికి అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు మోదీ. ఇందుకు అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. పండుగల వేళ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ఆనందాలు దూరమైపోతాయని, అప్రమత్తతతోనే జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయని స్పష్టం చేశారు.

" కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ పూర్తయింది. కానీ వైరస్ మాత్రం ఇంకా ఉంది. ప్రజలు కరోనా జాగ్రత్తలను పట్టించుకోకుండా ఉన్న కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలా నిబంధనలు పాటించకపోవడం ఏ మాత్రం మంచిది కాదు. మాస్కులు లేకుండా అజాగ్రత్తగా తిరిగితే మీతో పాటు మీ పిల్లలు, పెద్దలను ప్రమాదంలోకి నెట్టిన వారు అవుతారు. నవరాత్రులు, దసరా, దీపావళి వేళ మనందరం మరింత అప్రమత్తంగా ఉండాలి. అగ్నిని, శత్రువును, వ్యాధిని తక్కువ చేసి చూడవద్దు. "

-ప్రధాని నరేంద్ర మోదీ

దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
 

కరోనా విజృంభణ తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది ఏడో సారి

18:16 October 20

  • అగ్నిని, శత్రువును, వ్యాధిని తక్కువ చేసి చూడవద్దు: ప్రధాని
  • వ్యాధికి మందు లభించేవరకు నిర్లక్ష్యం కూడదు: మోదీ
  • పండుగల సమయం వచ్చేస్తోంది, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మన జీవితాలు ప్రమాదంలో పడతాయి
  • పండుగల సంతోషం నిరంతరం ఉండాలంటే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి
    ఆరడుగుల దూరం, మాస్కు ధరించడం తప్పనిసరి
  • పండుగల సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి
  • దేశ ప్రజలంతా కరోనా కట్టడికి కంకణబద్ధులే ముందడుగు వేయాలి
  • నవరాత్రులు, దసరా, దీపావళి వేళ మనందరం మరింత అప్రమత్తంమై సాగాలి
  • దేశ ప్రజలకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

18:09 October 20

  • కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యంగా ఉండవద్దు: ప్రధాని
  • కరోనా దేశం నుంచి విడిచిపోయిందనే భావన రానీయవద్దు: ప్రధాని
  • కరోనా తగ్గిందని భావిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది: ప్రధాని
  • కరోనా పోయిందని మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడినట్లే: ప్రధాని
  • మీతోపాటు మీ కుటుంబాన్ని, చిన్నాపెద్దా అందరినీ ప్రమాదంలో నెట్టినట్లే: ప్రధాని
  • యూరప్‌, అమెరికా పరిణామాలు చూస్తే నిర్లక్ష్యం కూడా ప్రమాదకరంగా మారవచ్చు: ప్రధాని

18:09 October 20

  • భారత్‌ కరోనాతో పోరాటం చేస్తోంది: ప్రధాని మోదీ
  • దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుంది: ప్రధాని మోదీ
  • దేశంలో 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకింది: ప్రధాని
  • అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో 10 లక్షల మందిలో 25 వేలమందికి సోకింది: ప్రధాని
  • కరోనా పరీక్షల కోసం 2 వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి: ప్రధాని
  • త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది: ప్రధాని
  • పరీక్షల సంఖ్య పెంచడంలో వైద్య వ్యవస్థ అత్యంత వేగంగా పనిచేసింది: ప్రధాని
  • వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేశారు: ప్రధాని

18:02 October 20

ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. 

"కరోనాపై పోరాటం కోసం విధించిన లాక్​డౌన్ పూర్తయింది. కానీ వైరస్​ ఇంకా ఉంది. అయితే వైరస్​ను అదుపుచేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాలు ఇచ్చాయి.​  కరోనా మరణాల రేటులో భారత్​ మెరుగైన స్థానంలో ఉంది." 

   - ప్రధాని నరేంద్ర మోదీ

17:35 October 20

ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా సంక్షోభం, బిహార్​ ఎన్నికలు, పండుగ సీజన్ మొదలు కావడం వంటి కారణాలతో మోదీ ఏం చెబుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

13:07 October 20

కరోనాపై నిర్లక్ష్యం తగదు: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 6గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ ప్రజలకు మోదీ ఓ సందేశాన్ని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

కరోనా సంక్షోభం, బిహార్​ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని ఏ విషయంపై జాతినుద్దేశించి ప్రసంగిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి.. జాతినుద్దేశించి మోదీ ప్రసంగించడం ఇది 7వసారి. చివరిగా ఈ ఏడాది జూన్​ 30న ప్రసంగించిన మోదీ.. ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజనను నవంబర్​ చివరి వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు ప్రసంగాల్లో.. కరోనా కట్టడి వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్​డౌన్​, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.

ఇదీ చూడండి:- 'దేశాభివృద్ధి కోసం అన్ని రంగాల్లో మార్పులు' 

Last Updated : Oct 20, 2020, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.