ETV Bharat / bharat

విమానాశ్రయంలో రూ.1.28కోట్ల గంజాయి పట్టివేత

author img

By

Published : Sep 3, 2020, 3:57 PM IST

8కేజీల గంజాయిని బెంగళూరు విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నట్టు నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో పేర్కొంది. దీని విలువ రూ. 1.28కోట్లు అని తెలిపింది.

Marijuana worth Rs 1.28 crore seized at Bengaluru airport
రూ.1.28కోట్లు విలువగల గంజాయి పట్టివేత

బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 1.28కోట్లు విలువగల 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో. ఓ ఎలక్ట్రానిక్​ పరికరంలో దీనిని గుర్తించినట్టు వెల్లడించింది.

Marijuana worth Rs 1.28 crore seized at Bengaluru airport
గంజాయి

బెంగళూరులో విజృంభిస్తున్న గంజాయి భూతాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఇందుకు సంబంధించి జరిగిన ఆపరేషన్​లో భాగంగా అహ్మద్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన వివరాలతో తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో గంజాయిని పట్టుకున్నారు.

ఇదీ చూడండి:- 14 ఏళ్ల బాలుడికి 'గంజాయి పొట్లాల' పార్సిల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.