ETV Bharat / bharat

అరుణాచల్​​ప్రదేశ్​, మహరాష్ట్రలో భూప్రకంపనలు

author img

By

Published : Aug 24, 2020, 11:50 AM IST

Updated : Aug 24, 2020, 12:52 PM IST

అరుణాచల్​ప్రదేశ్​ అన్జు జిల్లాలో భూమి స్వలంగా కంపించింది. రిక్టర్​ స్కేల్​పై 3.7 తీవ్రతగా నమోదైందని భూకంప కేంద్ర అధికారులు తెలిపారు. ఈ నెలలో భూకంపం సంభవించటం ఇది రెండోసారి కావటం గమనార్హం. మరోవైపు మహారాష్ట్ర పాల్​ఘర్​ జిల్లాలో ఆదివారం నాలుగు సార్లు భూప్రకంపనలు వచ్చాయి.

Earthquake hits Arunachal Pradesh's Anjaw
అరుణాచల్​ప్రదేశ్​, మహరాష్ట్రలో భూప్రకంపనలు

అరుణాచల్​ప్రదేశ్​లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై 3.7 తీవ్రత నమోదైంది. అన్జు జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3.36 గంటలకు వచ్చిన భూప్రకంపనలకు భయపడి ఆ ప్రాంతంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఆగస్టు 6న రాష్ట్రంలోని తవాంగ్​ ప్రాంతంలోనూ 3.0 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలోనూ...

మహారాష్ట్ర పాల్​ఘర్​ జిల్లాలో ఆగస్టు 23న నాలుగు సార్లు భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. కానీ ఈ ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదు.

"ఉదయం 11:39 గంటలకు 2.8 తీవ్రతతో మొదటి ప్రకంపన, సాయంత్రం 5:23 గంటలకు 3.0 తీవ్రతతో రెండోది సంభవించింది. కొంత సమయం తర్వాత 3.1 తీవ్రతతో సాయంత్రం 6:47 గంటలకు మరో భూకంపం, నాల్గోది మాత్రం రాత్రి 7:29 గంటలకు 2.7 తీవ్రతతో వచ్చింది." అని పాల్​ఘర్​ జిల్లా విపత్తు విభాగం అధికారి వివేకానంద్ కదమ్ తెలిపారు.

Last Updated : Aug 24, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.