'అగ్నిపథ్​' నోటిఫికేషన్ రిలీజ్.. రిజిస్ట్రేషన్​ అప్పటి నుంచే..

author img

By

Published : Jun 20, 2022, 2:29 PM IST

Updated : Jun 20, 2022, 3:01 PM IST

Agnipath Notification

Agnipath Notification: త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్'​ పథకానికి సంబంధించి నోటిఫికేషన్​ విడుదలైంది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. అందుకు తగ్గ పూర్తి విధివిధానాలను విడుదల చేసింది.

Agnipath Notification: త్రివిధ దళాలలో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్రం మరో ముందుడగు వేసింది. రిక్రూట్​మెంట్​కు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్​ను సోమవారం విడుదల చేసింది. దరఖాస్తుదారులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలని తెలిపింది. జులైలో దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వనుందని పేర్కొంది. స్కీమ్​కు సంబంధించి పూర్తి విధివిధాలను వెల్లడించింది. ఇండియన్​ ఆర్మీలో 'అగ్నివీర్స్​' ప్రత్యేకమైన ర్యాంక్​ కలిగి ఉంటారని తెలిపింది.

విధివిధానాలు..

  • 1923 యాక్ట్​ ప్రకారం నాలుగేళ్ల వ్యవధిలో అగ్నివీరులు ఎటువంటి సైనిక రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకూడదు.
  • కొన్ని సందర్భాల్లో అగ్నివీరులకు సమర్థ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది.
  • అగ్నివీరులు తమ యూనిఫామ్​పై ప్రత్యేకమైన బ్యాడ్జ్​ను ధరిస్తారు.
  • ఈ నోటిఫికేషన్​ ద్వారా రిక్రూట్​ అయిన వారు 1950 నిబంధనకు లోబడి విధులు నిర్వహిస్తారు.
  • నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల పనితీరును​ బట్టి.. 25 శాతానికి మించకుండా వారిని మళ్లీ సైన్యంలోకి తీసుకుంటారు.
  • నాలుగేళ్ల తర్వాత మళ్లీ కేంద్రం చేర్చుకునే వారు 15 ఏళ్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
  • నాలుగేళ్ల పూర్తయ్యాక అగ్నివీరులకు పదవిని ఎంచుకునే హక్కు ఉండదు.
  • రెగ్యులర్​ సర్వీస్​లో ఉన్నవారికి 90 రోజులు సెలవులు ఉంటాయి. సంవత్సరానికి 30 రోజులు అదనపు సెలవులు ఉంటాయి
  • వైద్యుల సలహా ఆధారంగా మెడికల్​ లీవ్​ మంజూరు చేస్తారు
  • అగ్నివీరుల నెలవారీ జీతంలో 30 శాతం కార్పస్​ ఫండ్ ​కోసం కోత విధిస్తారు. అయితే అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది.
  • 17.5 ఏళ్ల వయసు వారు అప్లై చేసుకునేటప్పుడు.. ఎన్​రోల్​మెంట్​​ ఫారమ్​పై తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సంతకం తప్పనిసరి.

'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్​ 14న ప్రకటించింది. 17న్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్ల పూర్తయ్యాక వారి 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు కొనసాగిస్తారని పేర్కొంది. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత.. నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో 2022 రిక్రూట్​మెంట్​లో గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 23 ఏళ్లకు పెంచింది.

ఆర్మీలో అగ్నివీర్‌ నియామక ప్రక్రియ కోసం సోమవారం ముసాయిదా నోటిఫికేషన్‌ వెలువడింది. తదుపరి.. సైన్యంలోని వివిధ రిక్రూట్‌మెంట్‌ విభాగాలు జులై 1 నుంచి నోటిఫికేషన్లు జారీచేస్తాయి. 'జాయిన్‌ ఇండియా వెబ్‌సైట్‌' ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నియామకం కోసం ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరులో ర్యాలీలు జరుగుతాయి. రెండు బ్యాచ్‌లుగా నియామకం జరుగుతుంది. తొలి బ్యాచ్‌లో 25వేల మందిని డిసెంబరు రెండో వారానికల్లా నియమిస్తారు. రెండో బ్యాచ్‌ నియామకం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ రెండింటిలో కలిపి 40వేల మందిని నియమిస్తారు. దేశవ్యాప్తంగా 83 ర్యాలీలు నిర్వహిస్తారు.

ఇవీ చదవండి: 'అగ్నివీరుల'కు ఆనంద్​ మహీంద్రా బంపర్​ ఆఫర్​

'భారత్​ బంద్​' పిలుపుతో భద్రత కట్టుదిట్టం.. ​5 వందల రైళ్లు రద్దు

Last Updated :Jun 20, 2022, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.