ETV Bharat / bharat

Animals Attack On Devotees In Tirupati: వెంకన్న దర్శనం.. అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ప్రాణసంకటం..!

author img

By

Published : Aug 12, 2023, 12:38 PM IST

Updated : Aug 12, 2023, 8:34 PM IST

Animals Attack on Devotees in Tirupati: తిరుమలకు వెళ్లాలంటే భక్తులు హడలిపోతున్నారు. ముఖ్యంగా మెట్ల మార్గంలో నడిచి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వరుస పెట్టి జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. మరి ఇంత జరుగుతున్నా టీటీడీ అధికారులు తీసుకునే చర్యలు ఏంటో ఆ ఏడుకొండలవాడికే తెలియాలి..!

Animals_Attack_on_Devotees_in_Tirupati
Animals_Attack_on_Devotees_in_Tirupati

వెంకన్న దర్శనం.. అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ప్రాణసంకటం..!

Animals Attack on Devotees in Tirupati: తిరుపతి.. ప్రముఖ పుణ్యక్షేత్రం. ఎప్పుడు తీరిక దొరికిన చాలా మంది తిరుమలకు వచ్చి స్వామి వారి సేవలో పాల్గొంటారు. అయితే స్వామి వారిని దర్శించుకునేందుకు చాలా మంది ఎంచుకునేది మెట్ల మార్గం. అయితే ఇప్పుడా మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు అయితే క్షణక్షణం భయం భయంగా ఉంటున్నారు. ఎటు వైపు నుంచి ఏ జంతువు వచ్చి దాడి చేస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా జంతువుల దాడి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా నిన్న రాత్రి జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. అయితే అలిపిరి మార్గంలో వరుస దాడులు జరుగుతున్నా టీటీడీ అధికారులు తీసుకునే చర్యలు ఏంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Bear in Tirumala: తిరుమల కాలినడక మార్గంలో అర్ధరాత్రి ఎలుగుబంటి హల్​చల్..

Leopard Attacked on Six Years Girl: ఆగస్టు 11న నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల చిన్నారిని చిరుత హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొద్దీ రోజులుగా నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో చిరుత సంచరిస్తోందని సమాచారం. రెండు రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో నిద్రిస్తున్న కార్మికులపై కూడా చిరుత దాడి చేసినట్లు పలువురు చెబుతున్నారు. సరిగ్గా రెండు రోజుల తరువాత కూడా అదే ప్రాంతంలో లక్షితపై దాడి చేసి చంపేయడంతో ఈ అంశం మరోమారు సంచనం రేపింది.

Chirutha Attack on Girl: అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడి.. బాలిక మృతి

Leopard Attacked on Boy in Tirupati: కాగా ఇదే సంవత్సరం.. సరిగ్గా రెండు నెలల క్రితం (జూన్ 22) తిరుమల నడకదారిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో కౌశిక్​ అనే బాలుడు గాయపడ్డాడు. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్‌కు చెందిన శిరీష, కొండయ్యల కుమారుడు ఐదేళ్ల కౌశిక్​పై ఏడో మైలురాయి వద్ద చిరుత దాడి చేసింది. కౌశిక్ మెడ కరుచుకుని అమాంతం అడవిలోకి లాక్కెళ్లింది. చుట్టూ ఉన్న వాళ్లు కేకలేయడంతో వెంటనే వదిలేసి పరారైంది. చిరుత దాడిలో బాలుడు కౌశిక్ తీవ్రంగా గాయపడి.. తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నాడు.

Leopard Trapped: బోనులో చిక్కిన చిరుత.. ఊపిరి పీల్చుకున్న భక్తులు

TTD Actions on Leopard Attacks: అధికారులు తీసుకునే చర్యలేంటి: అయితే వరుసగా చిరుత దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు తీసుకునే చర్యలపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రమాదం జరిగిన మొదట్లో హడావుడి చేసి.. ఆ తర్వాత మాములుగా ఉండటం.. మళ్లీ దాడి చేసినప్పుడు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్​పై దాడి అనంతరం టీటీడీ అధికారులు తీసుకున్న చర్యలే ఇందుకు నిదర్శనం.

ఆరేళ్ల బాలికపై చిరుత దాడి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి..

Leopard Attacks in Tirupati: కౌశిక్​పై చిరుత దాడి తర్వాత అప్రమత్తమైన టీటీడీ అధికారులు అలిపిరి మెట్ల మార్గంలో కొన్ని మార్పులు చేశారు. రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలి గోపురం నుంచి 200 మంది చొప్పున భక్తులను బృందాలుగా పంపే ఏర్పాట్లు చేశారు. వీరితో పాటు సెక్యూరిటీ గార్డ్‌ కూడా ఉంటారు. అలాగే చిన్న పిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని అప్రమత్తంగా వెళ్లేలా ఏర్పాటు చేశారు. అలిపిరి మార్గంలో రాత్రి 10 వరకు భక్తులను అనుమతిస్తారు. మరి ఇన్ని చర్యలు తీసుకుంటే మళ్లీ చిరుతలు ఎందుకు దాడి చేస్తున్నాయనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

తిరుపతి జిల్లాలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

Forest Officers Suggestions to Devotees: మళ్లీ అవే సూచనలు: తాజాగా బాలికపై చిరుత దాడితో ఫారెస్టు అధికారులు అప్రమత్తమయ్యారు. 7వ మైల్ నుంచి నరసింహ స్వామి గుడి వరకూ హై అలెర్ట్ జోన్​గా ప్రకటించినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 24 గంటల పాటు నిఘా పెడుతున్నామన్నారు. నడకదారిలో వచ్చే భక్తులు గుంపులుగా రావాలని సూచించారు.

రెండు నెలల క్రితం బాలుడిపై జరిగిన చిరుత దాడితోనే టీటీడీ, ఫారెస్టు అధికారులు అప్రమత్తమై కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి ఉంటే ఇప్పుడు ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయేది కాదని పలువురు వాదిస్తున్నారు. ఇప్పటికైనా కఠిన చర్యలు చేపట్టి శ్రీనివాసుని దర్శనానికి వచ్చే వారిని అడవి జంతువుల బారిన పడకుండా క్షేమంగా ఇంటికి వెళ్లేలా చూడాలని కోరుతున్నారు.

ఏడాది తర్వాత ఏకమైన తల్లీబిడ్డలు.. ఇది ఓ చిన్నారి చిరుత కథ!

Last Updated : Aug 12, 2023, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.