ETV Bharat / bharat

ఆమెకు '18'.. అతడికి '20'.. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి.. పోలీసుల ఎంట్రీతో..

author img

By

Published : Dec 30, 2022, 3:22 PM IST

ప్రేమించిన అమ్మాయికి 18 ఏళ్లు నిండేంత వరకు ఎదురుచూసిన ఓ యువకుడు తనకు మాత్రం చట్టబద్ధంగా వివాహం చేసుకునే వయసు రాకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఏం చేశారంటే?

A young man marries without the legal age limit in Karnataka
పెళ్లి చేసుకునే వయసు రాకుండానే వివాహం చేసుకున్న యువకుడు

అమ్మాయికి 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే వాటిని బాల్యవివాహాలుగా పరిగణిస్తారు. అలాంటి వివాహాలు రద్దైన సంఘటనలు మనం చాలానే చూసి ఉంటాం. అయితే కర్ణాటకలో మాత్రం ఓ అరుదైన ఘటన జరిగింది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి 18 ఏళ్లు నిండేంత వరకు ఎదురుచూశాడు. కానీ చట్టబద్ధంగా వివాహం చేసుకునేందుకు తనకు 21 సంవత్సరాలు నిండాలనే విషయాన్ని మర్చిపోయి పెళ్లి చేసుకున్నాడు. చివరకు ఏమైందంటే?

అసలేం జరిగిందంటే?
బెంగళూరు సమీప ప్రాంతమైన నీలసంద్రంలో క్యాబ్​ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు ఆ యువకుడు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఆమెకు 18 సంవత్సరాలు నిండగానే పారిపోయి నవంబరు 4న పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో తమ కుమార్తె కనిపించడం లేదని యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డిసెంబర్ 23న తిరువళ్లూరులో వారిని అదుపులోకి తీసుకున్నారు.

తమ ఆధార్​ కార్డులను పోలీసులకు చూపించి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నామని ఆ యువకుడు పోలీసులతో చెప్పాడు. అయితే ఆధార్​ కార్డులను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బాలిక మేజర్ అయ్యేంతవరకు ఎదురుచూసిన యువకుడు తనకు మాత్రం వివాహం చేసుకునే వయసు రాలేదన్న విషయం మర్చిపోయాడు. యువతికి 18 ఏళ్లు నిండిపోయాయి. కానీ ఆ యువకుడి వయసు 20 ఏళ్ల 6 నెలలు మాత్రమే. దీంతో వారిద్దరి వివాహం చెల్లదని చెప్పిన పోలీసులు.. అతడి అక్కను, స్నేహితులను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్​పై రిలీజ్ చేశారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.