ETV Bharat / bharat

తొందరెందుకు..! 28నే విచారణ.. ఏపీ రాజధాని అంశంపై తేల్చిచెప్పిన సుప్రీం

author img

By

Published : Mar 2, 2023, 12:06 PM IST

Updated : Mar 2, 2023, 12:58 PM IST

Ap capital city : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు విషయంలో ఏపీ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేసు విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం నిరాకరించింది. ఇంతకు ముందు చెప్పినట్లుగా మార్చి 28నే విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు
సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

Ap capital city : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు విషయంలో ఏపీ ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కేసు విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం నిరాకరించింది. ఇంతకు ముందు చెప్పినట్లుగా మార్చి 28నే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కాగా, ఆ ఒక్కరోజు మాత్రమే గాకుండా మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు విన్నవించారు.

అమరావతి రాజధాని కేసు పరిధి చాలా పెద్దదని.. విచారణ చేపడితే సార్థకత ఉండాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. ఇందులో రాజ్యాంగపరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతకుమించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని స్పష్టం చేశారు. అయితే, తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరినప్పటికీ ధర్మాసనం తోసిపుచ్చింది. నోటీసులిచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సీజేఐ సర్క్యులర్‌ ఉందని ధర్మాసనం గుర్తుచేసింది.

మూడు రోజులైనా గడవక ముందే.. అమరావతి కేసు విచారణ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గత సోమవారం ద్విసభ్య ధర్మాసనం ముందుంచారు. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం.. మార్చి 28న విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అయితే, మూడు రోజులైనా గడవక ముందే మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.

ఫిబ్రవరి 9న అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ.. విభజన చట్టం నిబంధనలను అనుసరించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు సెక్షన్‌ 94ను అనుసరించి నూతన రాజధాని నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించింది. రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిన నేపథ్యాన.. కేంద్ర హోం శాఖ అండర్‌ సెక్రటరీ శ్యామల్‌కుమార్‌ బిత్‌ అఫిడవిట్‌ సమర్పించారు.

విభజన చట్టంతో ముడిపడి ఉంది.. రాజధాని నగరానికి సంబంధించిన అంశం విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6తో ముడిపడి ఉందని తెలిపారు. ఆ మేరకు కేంద్రం రాజధానికి ప్రత్యామ్నాయాల అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. కమిటీ నివేదిక తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం.. నూతన రాజధాని నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అందుకే... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నిధులు సమకూర్చినట్లు తెలిపారు. సీఆర్‌డీఏను రద్దు చేసి, మూడు రాజధానుల దిశగా.. వికేంద్రీకరణ చట్టాలను తెచ్చే ముందు ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీ విభజన చట్టం, శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికల్లోని ముఖ్యాంశాలను అఫిడవిట్ లో జత చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Mar 2, 2023, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.