ETV Bharat / bharat

నెలన్నర నుంచి ఒకేచోట ఉంటున్న నాగుపాము.. తరలివస్తున్న భక్తులు

author img

By

Published : Jan 2, 2023, 12:43 PM IST

మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో నెలన్నర నుంచి నివాసముంటున్న ఓ నాగుపాము అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ అరుదైన సంఘటన కర్ణాటకలో జరిగింది. దీంతో రోజూ అధిక సంఖ్యలో ప్రజలు ఆ పామును చూసేందుకు తరలివస్తున్నారు.

A cobra has been staying in one place for one and half month in karnataka
నెలన్నర నుంచి ఒకేచోట ఉంటున్న నాగుపాము

నెలన్నర నుంచి ఒకేచోట ఉంటున్న నాగుపాము

కర్ణాటకలో ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో నెలన్నర నుంచి ఉంటున్న ఓ నాగుపాము అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. దీంతో ఈ పామును చూసేందుకు జనం అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. బెంగళూరులోని అనేకాల్​లో నారాయణ్​పుర్​ సరస్సు ఒడ్డున ఉన్న ఓ చెట్టుపైకి ఆ పాము రోజూ వెళ్తోంది. ఉదయం 11 గంటల సమయానికి ఆ నాగుపాము వచ్చి చెట్టు కొమ్మపై నిద్రించి సాయంత్రం 5 గంటలకు తిరిగి గ్రామంలోని పుట్టలోకి వెళ్లిపోతోందని స్థానికులు అంటున్నారు.

రోజూ వచ్చి ఆ సర్పం రోడ్డు పక్కనున్న చెట్టుపై నిద్రించిన సమయంలో ఎంతమంది వచ్చినా పాము మాత్రం చలించకుండా అక్కడే ఉంటోంది. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోయే ఈ పామును చూసి చాలా మంది భక్తులు తరలివచ్చి చేతులెత్తి మొక్కుతున్నారు. అయితే ఇంతకు ముందు ఆ ప్రాంతంలో దేవాలయాలు ఉండేవి. ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు. అందుకే ఆ ప్రాంతానికి నాగుపాము వచ్చి ఉంటోందని కొంతమంది విశ్వసిస్తున్నారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.