80 ఏళ్ల వయసులో 600 కిమీ బైక్​ రైడ్, బామ్మకు హ్యాట్సాఫ్​ చెప్పాల్సిందే

author img

By

Published : Aug 24, 2022, 1:53 PM IST

80 years old lady drive bike 600 km to baba ramdevra temple  in mp

ఆమె వయసు 80 ఏళ్లు. అయితేనేం ఎంతో నేర్పుతో 600 కిలోమీటర్ల దూరం బైక్​ డ్రైవ్​ చేస్తూ తన ఆరాధ్య దైవాన్ని దర్శనం చేసుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇంతకీ ఆమె ఎవరంటే.

80 Year Old Lady Biker : 80 ఏళ్ల వయసులో ఎవరైనా తమ వాళ్లతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తారు. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా మరొకరిపై ఆధారపడుతుంటారు. ఎవరూ తోడు లేకపోతే ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో మరికొంతమంది ఉంటారు. కానీ మధ్యప్రదేశ్​కు చెందిన ఓ 80 ఏళ్ల బామ్మ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా జీవనాన్ని సాగిస్తున్నారు. అంతే కాకుండా తాజాగా తన బైక్​పై 600 కిలోమీటర్లు​ రైడ్​ చేసి దైవ దర్శనానికి కూడా వెళ్లారు. చేయాలనే దృఢ సంకల్పం ఉంటే వయసుతో సంబంధం లేదని నిరూపించారు.

నీమచ్ జిల్లా మనాస మండలానికి చెందిన సోహన్‌బాయి అనే 80 ఏళ్ల వృద్ధురాలు.. బాబా రామ్​దేవ్రాను నిత్యం ఆరాధిస్తుంటారు. అయితే తన స్వస్థలానికి వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న బాబా రామ్​ దేవ్రా పుణ్యక్షేత్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉన్న బైక్​పై బయలుదేరారు. కానీ తనతోపాటు ఎవ్వరినీ తీసుకెళ్లలేదు. బైక్​పై ఒంటరిగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బాబా రామ్​ దేవ్రా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చారు. మార్గమధ్యలో ఆమె పర్యటన గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడుతున్న వీడియో సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్​గా మారింది.

నీమచ్​ జిల్లాలోని జాలీనర్​ గ్రామానికి చెందిన సోహన్​ బాయి.. మనాసలో నివాసం ఉంటున్న హరిచంద్​ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొద్దిరోజులపాటు వారిద్దరి వైవాహిక జీవితం సాఫీగా సాగినా.. ఆ తర్వాత తరచూ గొడవలు జరిగాయి. దీంతో సోహన్ బాయి తన పిల్లలను తీసుకుని ఒంటరిగా జీవించారు. ఇప్పుడు ఆమె పిల్లలు స్థిరపడి మంచి స్థితిలో ఉన్నా.. సోహన్​బాయి మాత్రం మళ్లీ ఒంటరిగానే ఉంటున్నారు. అయితే సోహన్​బాయి ఏటా బైక్​పైన బాబా రామ్​దేవ్రా పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుంటారని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: ఉద్యోగార్థులకు గుడ్​ న్యూస్​, ఇకపై UPSCలోనూ వన్ ​టైమ్​ రిజిస్ట్రేషన్

కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిగా రాజస్థాన్​ సీఎం, ఎంతవరకు నిజం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.