ETV Bharat / bharat

ఇంట్లోకి దూరి వివాహితపై అత్యాచారం- ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Oct 24, 2021, 5:45 PM IST

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. నిందితులను కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ సంఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

raped woman in Jamshedpur
వివాహితపై అత్యాచారం

ఝార్ఖండ్​ జెంషద్​పుర్​లోలో ఓ వివాహిత(24)పై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. జుగల్సాయి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని గరిబ్​ నవాజ్​ కాలనీలో ఈ ఘటన జరిగింది.

ఒంటరిగా ఉందని తెలుసుకున్న దుండగులు.. ఇంట్లోకి ప్రవేశించి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్​ చేసినట్లు చెప్పారు. నిందితులు ఇద్దరు.. బాధితురాలు ఉండే కాలనీకి చెందినవారిగా అధికారులు గుర్తించారు.

ఇదీ చూడండి: లోయలో పడిన పెళ్లి బస్సు- ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.