ETV Bharat / bharat

మైనర్​పై యువకుల గ్యాంగ్​రేప్.. కిడ్నాప్​ చేసి గదిలో బంధించి హింస..

author img

By

Published : Jul 15, 2022, 9:27 AM IST

15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. మరోవైపు, మైనర్​పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తికి 11 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ఉడుపి జిల్లా ఫాస్ట్​ట్రాక్ కోర్టు.

Alwar Minor Rape case
సామూహిక అత్యాచారం

15 ఏళ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్​లోని దౌసాలో బుధవారం జరిగింది. లోకేష్, సతీష్​లను నిందితులుగా పోలీసులు గుర్తించారు. "బాధితురాలి పాఠశాల సమీపంలోని ఓ దుకాణం దగ్గర ఉండగా నిందితులు బైక్​పై వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారు. ఓ గదిలో బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం దౌసాలోని జాతీయ రహదారిపై వదిలేశారు. బాధితురాలు.. పాదచారులకు ఫోన్ అడిగి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వారు ఘటనా స్థలానికి వచ్చి బాధితురాల్ని ఇంటికి తీసుకెళ్లారు" అని పోలీసులు వెల్లడించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఆరేళ్ల మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు 65 ఏళ్ల వృద్ధుడు. ఈ ఘటన రాజస్థాన్​లోని నీమరానా పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదైనా రాజీ కుదిర్చేందుకు గ్రామపెద్దలు బాధిత కుటుంబంపై ఒత్తిడి చేస్తున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ జరిగింది: జూలై 10న బాలిక గ్రామంలో పెళ్లి భోజనాలకు వెళ్లి వస్తుండగా వృద్ధుడు ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వీరు వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లగా.. అప్పటికే అతడు పరారయ్యాడు. గ్రామ పెద్దలకు ఈ విషయం తెలిసింది. నిందితుడిపై కేసు పెట్టవద్దని గ్రామంలోనే నిందితుడికి శిక్ష వేద్దామని బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి చేశారు. అందుకు అంగీకరించని బాధితురాలి కుటుంబ సభ్యులు నీమరానా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

కఠిన కారాగార శిక్ష: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్​పై లైంగిక వేధింపులకు గురి చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అతడికి ఉడుపి జిల్లా ఫాస్ట్​ట్రాక్ కోర్టు 11 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కొడవూరుకు చెందిన కిరణ్ (28) అనే వ్యక్తి 16 ఏళ్ల మైనర్​తో స్నేహం చేసి పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ చర్యను ఫోన్‌లో రికార్డ్ చేశాడు. వీటితో బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. నిందితుడు కిరణ్​.. బాధితురాలికి రూ.4 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పోక్సో చట్టం కింద రూ.10 వేలు, లైంగిక వేధింపులకు పాల్పడినందుకు మరో రూ.10 వేలు కోర్టుకు చెల్లించాలని తెలిపింది.

ఇవీ చదవండి:

భారత్​లో మంకీపాక్స్ కలకలం.. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్​

రాజకీయ పార్టీల విరాళాలపై కొవిడ్​ దెబ్బ.. 41% డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.