ETV Bharat / snippets

విజయ డైరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 12:02 PM IST

TDP  Leader Yerneni Sita Devi Died
TDP Senior Leader Yerneni Sita Devi Expired (ETV Bharat)

Vijaya Dairy Director Yerneni Sita Devi Passed Away : తెలుగుదేశం పార్టీ ​ నాయకురాలు, మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్​లో మృతి చెందారు. సీతాదేవి ముదినేపల్లి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ కేబినెట్​లో మంత్రిగా పనిచేశారు. ఆమె పార్ధివదేహాన్ని ఈరోజు సాయంత్రం స్వగ్రామం కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండలం, కోడూరుకు తరలించనున్నారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నాయి. సీతాదేవి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.