ETV Bharat / snippets

మళ్లీ కలకలం రేపుతున్న ఫెడెక్స్​ పార్సిల్ మోసాలు - రూ.14.75 లక్షలు కాజేసిన సైబర్​ కేటుగాళ్లు

author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 7:54 PM IST

Fedex Parcel Fraud in Hyderabad
Fedex Parcel Fraud in Hyderabad (ETV Bharat)

Fedex Parcel Fraud in Hyderabad : హైదరాబాద్​ నగరానికి చెందిన విశ్రాంత మహిళ ఫెడెక్స్​ మోసానికి బలైంది. ఓ వీడియో కాల్​ ద్వారా తన పేరిట వచ్చిన పార్సిల్​లో 5 కిలోల వస్త్రాలతో పాటు 7 నకిలీ పాస్​పోర్టులు, 5 ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు, 960 గ్రాముల కొకైన్​ వచ్చిందని సైబర్​ నేరగాళ్లు బెదిరించారు. ముంబయి క్రైమ్ బ్రాంచ్​ నుంచి చేస్తున్నట్లుగా బ్యాంక్​ వెరిఫై చేయాలని వివరాలన్నీ సేకరించారు. ఆ తర్వాత బాధితురాలి ఖాతా నుంచి రూ.14,73,400లను సైబర్​ నేరగాళ్లు కాజేశారు. ఈ మేరకు ఆమె సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదుు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.