ETV Bharat / snippets

'మై నేమ్ ఈజ్ స్టార్క్- నేను నాకౌట్ మ్యాచ్ స్పెషలిస్ట్'!

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 1:33 PM IST

Mitchell Starc IPL 2024
Mitchell Starc IPL 2024 (Source: Associated Press)

Starc IPL 2024: కోల్​కతా నైట్​రైడర్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్​ ధర (రూ.24.75కోట్లు)పై ఈ సీజన్​లో అనేక చర్చలు జరిగియి. దానికి తగ్గట్లుగా సీజన్ ప్రారంభంలో స్టార్క్ ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉండింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ, స్టార్క్ ఏ మాత్రం కుంగిపోలేదు. ట్రోల్స్​కు బెదిరిపోలేదు. అవన్నింటికీ నాకౌట్ మ్యాచ్​ల్లో సమాధానం ఇచ్చాడు. క్వాలిఫయర్​- 1లో 3 కీలక వికెట్లు పడగొట్టిన స్టార్క్, ఫైనల్​లోనూ 2 వికెట్లు నేలకూల్చి 'ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్'​గా ఎంపికయ్యాడు. అయితే నాకౌట్ మ్యాచ్​ల్లో రాణించడం స్టార్క్​కు ఇది కొత్తేం కాదు. డూ ఆర్ డై మ్యాచ్​ల్లో తన బౌలింగ్‌లో ఆడటం కష్టమని మరోసారి నిరూపించాడు. కీలక మ్యాచ్​ల్లో స్టార్క్ రాణించిన సందర్భాలు.

  • 2015 వరల్డ్​కప్ ఫైనల్- 20/2 vs న్యూజిలాండ్
  • 2023 డబ్ల్యూటీసీ ఫైనల్- 2/71, 2/77 vs భారత్
  • 2023 వరల్డ్​కప్ ఫైనల్- 3/45 vs భారత్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.