'ఫౌజీ రిలీజ్ వాయిదా- కానీ మూవీ వేరే లెవెల్'- నిర్మాత రవిశంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఫౌజీ రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత - కొంచెం లేట్ అవుతుందని క్లారిటీ - బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఆ రేంజ్ సినిమా ఇదని వెల్లడి

Published : September 22, 2026 at 6:59 AM IST
Fauzi Release Postponed : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా అందరూ అనుకున్నట్లుగానే వాయిదా పడింది. డిసెంబరు 3వ తేదీన రావాల్సిన సినిమా కొంచెం వెనక్కి వెళ్లనుందని నిర్మాత వై.రవిశంకర్ స్వయంగా ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన 'ది ప్యారడైజ్' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన ఫౌజీ మూవీ గురించి మాట్లాడారు.
బాహుబలి రేంజ్ సినిమా ఫౌజీ
'ఫౌజీ కొంచెం వెనక్కి వెళ్తోంది. ఇది వేరే లెవెల్ సినిమా. ప్రభాస్‌ను 'బాహుబలి' తర్వాత మళ్లీ అంత గొప్పగా చూపించే చిత్రమిది. కచ్చితంగా ప్రేక్షకులకు జీవితాంతం గుర్తుండిపోతుంది' అని అన్నారు. దీంతో సినిమా వాయిదా పడుతుందని ఫ్యాన్స్‌కు క్లారిటీ వచ్చేసింది. ఇక త్వరలోనే మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారంగా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.
“#Fauzi is postponed to a later date, but it will be on ANOTHER LEVEL. After #Baahubali, Rebel star #Prabhas will be seen in such a grand way again. It’s that range of a film, and it will have 5 songs.” 🔥🔥🔥
— Hail Prabhas (@HailPrabhas007) September 21, 2026
~ Producer pic.twitter.com/L7vVXKghKm
యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఫౌజీ ఒకటి. తొలుత డిసెంబర్ 3న రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయగా రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ ప్రస్తుతం నిరాశలో ఉన్నారు. అయితే ఇది ఒకింత మంచిదేనంటూ మరికొంత మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఓ పక్క ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' షూటింగ్‌ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నారు.
ప్రభాస్ డబుల్ ధమాకా
ఇందులో ఫౌజీ షూటింగ్ ఇంకా 10-12 రోజుల బ్యాలెన్స్ ఉండగా, స్పిరిట్ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. ఫౌజీ అనుకున్న డేట్లో రాకపోయినా రిలీజ్ విషయంలో పెద్దగా లేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక స్పిరిట్ విషయానికొస్తే వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఒకే ఏడాది రెండు సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీసును షేక్ చేసే అవకాశాలు ఉంటాయని డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రిపబ్లిక్ డేకి ఫౌజీ!
ప్రస్తుతం ఫౌజీ డిసెంబర్ రేసు నుంచి తప్పుకోవడంతో వచ్చే ఏడాది జనవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే జనవరి రేసులో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అయితే దేశభక్తి తరహా చిత్రం కావడంతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న వస్తుందేమోనని నెట్టింట చర్చ జరుగుతోంది. ఫైనల్‌గా రిలీజ్‌పై మేకర్స్ ఏ డేట్ ఇస్తారనేది ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతుంది.
#FauZi — Jan 26#Spirit — Mar 5#Kalki2 — Jun 27#Salaar2 — Sep 28#BaahubaliTheEternalWar — Dec 22
— The Batman © (@ChicPursuitEFX) September 15, 2026
2027 = #Prabhas YEAR 🥵🔥👑 pic.twitter.com/lQNMSQeTom
హను మార్క్ లవ్‌స్టోరీ!
ఫౌజీ 1940ల కాలం నాటి పీరియాడికల్ మూవీగా రూపొందుతున్నట్లు ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారు. అంతేకాకుండా ఇందులో అద్భుతమైన లవ్‌స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. స్వతహాగానే లవ్స్టోరీల స్పెషలిస్ట్‌గా పేరున్న హను రాఘవపూడి ఇందులోనూ మంచి లవ్‌స్టోరీని రాసుకుని ఉంటారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా రెండు పార్టులుగా తెరకెక్కించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తోంది. దీనికి ప్రీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.
ఇక ఫౌజీ సినిమా విషయానికొస్తే, దర్శకుడు హనురాఘవపూడి తెరకెక్కిస్తున్న ఆ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బంగాలీ భాషల్లో రిలీజ్ కానుంది. ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్, రాహుల్ రవీంద్రన్, చైత్ర జె. ఆచార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా, సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
ఫౌజీ మళ్లీ వాయిదా పడనుందా?- విశ్వక్ సినిమా అనౌన్స్‌మెంట్‌తో కొత్త డౌట్!
గచ్చిబౌలిలో మరో చార్మినార్- ప్రభాస్ మూవీ కోసం భారీ ప్లానింగ్

