భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు- ఆగస్టు 5న తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు - హైదరాబాద్, వైజాగ్ల్లో ఎలా ఉన్నాయంటే?

Published : August 5, 2026 at 9:32 AM IST
Gold Rate Today : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు, వివిధ దేశాల కరెన్సీ విలువల్లో వస్తున్న మార్పులు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
క్యాప్స్ గోల్డ్ వెబ్సైట్ ప్రకారం, మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,47,080 ఉండగా, బుధవారం నాటికి రూ.1,790 పెరిగి రూ.1,48,870కు చేరుకుంది. విజయవాడ, వైజాగ్, నెల్లూరు, ప్రొద్దుటూరుల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. కాగా, బంగారు నగల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, బుధవారం తులం ధర రూ.1,32,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రోజు ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 4128 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
భారీగా పెరిగిన వెండి ధరలు
క్యాప్స్ గోల్డ్ వెబ్సైట్ ప్రకారం, బుధవారం వెండి ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం కేజీ వెండి ధర రూ.2,24,914 ఉండగా, బుధవారం నాటికి రూ.4,584 పెరిగి రూ.2,29,498కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ సిల్వల్ ధర 60.77 డాలర్లుగా ఉంది. పారిశ్రామిక రంగం నుంచి భారీగా డిమాండ్ పెరుగుతుండడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బంగారు నగల స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారు ఆభరణాలు కొనేముందు వాటి స్వచ్ఛత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఏమేమి చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీఐఎస్ హాల్‌మార్క్ : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం, బంగారు ఆభరణాలపై కచ్చితంగా హాల్‌మార్కింగ్ ఉండాలి. ఈ హాల్‌మార్కింగ్‌లో 5 భాగాలు ఉంటాయి. అవి ఏమిటంటే?
1. హాల్‌మార్క్ గుర్తు : మీరు కొన్న ఆభరణంపై హాల్‌మార్క్ లోగో ఉందో, లేదో చూసుకోవాలి.
2. బంగారంలో రకాలు :
999 - 24 క్యారెట్స్ (ఈ స్వచ్ఛమైన బంగారంతో నగలు చేయలేరు)
958 - 23 క్యారెట్స్
916 - 22 క్యారెట్స్
875 - 21 క్యారెట్స్
750 - 18 క్యారెట్స్
708 - 17 క్యారెట్స్
585 - 14 క్యారెట్స్
417 - 10 క్యారెట్స్
375 - 9 క్యారెట్స్
333 - 8 క్యారెట్స్
3. హాల్ మార్కింగ్ సెంటర్ మార్క్ : నగలు కొనే సమయంలో కచ్చితంగా హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోను కూడా తనిఖీ చేయాలి. హాల్‌మార్కింగ్ కేంద్రాల జాబితాను https://bis.gov.in/cert/list_of_hc.asp/ వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
4. మార్కింగ్ సంవత్సరం : ఆభరణాలను తయారుచేసిన సంవత్సరం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రూపంలో ఉంటుంది. ఉదాహరణకు A అక్షరం 2000 సంవత్సరాన్ని సూచిస్తుంది. అలాగే J -2008, N-2010, M- 2011 మొదలైనవి.
5. జ్యువెలర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్ : బంగారం వ్యాపారస్తులు కచ్చితంగా బీఐఎస్ సర్టిఫైడ్ ఐడెంటిఫికేషన్ మార్క్‌ను కలిగి ఉండాలి. అందువల్ల మీరు బంగారం కొనేముందు కచ్చితంగా ఆ షాప్ గుర్తింపు మార్క్‌ను చెక్ చేసుకోవాలి.
ఈ 3 తనిఖీ చేయాల్సిందే : ప్రభుత్వ నిబంధనల ప్రకారం, హాల్మార్క్డ్ ఆభరణాల్లో 3 గుర్తులు కచ్చితంగా ఉండాలి. అవి :
- BIS లోగో
- Purity/ Fineness Grade
- ఆరు అంకెల ఆల్ఫాన్యూమెరిక్ కోడ్ ( HUID)
KDM Gold Purity : కొందరు KDM ఆభరణాలు కొంటుంటారు. వాళ్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, కేడీఎం అనేది బంగారం స్వచ్ఛతను నిర్ధరణ చేయదు. అందుకే వీలైనంత వరకు హాల్‌మార్కింగ్ ఉన్న బంగారం కొనడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే, మీరు ఎంత ఎక్కువ పరిమాణంలో బంగారం కొన్నప్పటికీ, ఈ హాల్‌మార్కింగ్ ఛార్జ్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది.
క్రెడిట్ కార్డుతో ఈ 'బిల్లులు' చెల్లిస్తున్నారా? - మీరు నష్టపోయే ఛాన్స్ ఉంది జాగ్రత్త!
బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం- దాదాపు 37 శాతం పసిడి పతనానికి ఛాన్స్

