బంగారం కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో జులై 21న ధరలు ఇలా!
దేశంలో బంగారం ధరల వివరాలు మీకోసం- హాల్‌మార్క్, మజూరీ, బై-బ్యాక్ పాలసీ, డాక్యుమెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణుల సూచన

Published : July 21, 2026 at 9:33 AM IST
Gold Rate Today : దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా రోజూ మారుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ఒడిదుడుకులు, అమెరికా డాలర్ మారకం విలువల్లో హెచ్చుతగ్గులు, పారిశ్రామిక రంగం నుంచి వచ్చే డిమాండ్, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణి వంటి అంశాలు ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మంగళవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
క్యాప్స్ గోల్డ్ వివరాల ప్రకారం, మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,47,130గా నమోదైంది. ఇదే ధర విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, బెంగళూరు, ముంబయి వంటి ప్రధాన మార్కెట్లలో కూడా కొనసాగుతోంది. ఇక నగల తయారీలో ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,510గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు మార్కెట్లలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,75,579గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణి వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ధరలను తప్పనిసరిగా పోల్చుకోవాలి
బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు వినియోగదారులు ఒకే దుకాణంపై ఆధారపడకుండా రెండు, మూడు దుకాణాల్లో ధరలను పోల్చి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్‌టీ, ఇతర అదనపు రుసుములు ఎంత వసూలు చేస్తున్నారో తెలుసుకోవాలి. కొనుగోలు చేసే రోజు మార్కెట్ ధర ఎంత ఉందో ముందుగానే తెలుసుకుంటే అనవసరంగా అధిక ధర చెల్లించే పరిస్థితి ఉండదు.
24 వర్సెస్ 22 క్యారెట్ బంగారం
24 క్యారెట్ల బంగారం దాదాపు 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. అయితే ఇది చాలా మెత్తగా ఉండటంతో ఆభరణాల తయారీకి అనువుగా ఉండదు. అందుకే దీనిని ప్రధానంగా బంగారు నాణేలు, బార్లు, బిస్కెట్లు వంటి పెట్టుబడి ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. 22 క్యారెట్ల బంగారం 91.6 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. దీనినే 916 బంగారం అని పిలుస్తారు. ఇందులో రాగి, వెండి వంటి ఇతర లోహాలను కలపడం వల్ల అది దృఢంగా మారి ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల భారత మార్కెట్‌లో విక్రయించే ఎక్కువ శాతం బంగారు నగలు 22 క్యారెట్ల బంగారంతోనే తయారవుతాయి.
మేకింగ్ ఛార్జీలపై స్పష్టత అవసరం
బంగారు ఆభరణాల ధరలో మేకింగ్ ఛార్జీలు కీలక పాత్ర పోషిస్తాయి. నగ డిజైన్, పనితనం ఆధారంగా ఈ ఛార్జీలు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు మేకింగ్ ఛార్జీలు ఎంత, అవి గ్రాముల వారీనా లేదా శాతం ప్రకారమా అనే విషయాన్ని షాపు నిర్వాహకులను అడిగి తెలుసుకోవడం మంచిది.
బై-బ్యాక్ పాలసీ తెలుసుకోవాలి
బంగారం కొనుగోలు చేసే ముందు ఆ జువెలరీ సంస్థ బై-బ్యాక్ పాలసీ గురించి కూడా తెలుసుకోవాలి. భవిష్యత్తులో అదే దుకాణంలో నగలను విక్రయించాలనుకుంటే లేదా మార్పిడి చేయాలనుకుంటే ఏ నిబంధనలు వర్తిస్తాయి? ఎంత శాతం విలువ ఇస్తారు? వంటి అంశాలపై ముందుగానే స్పష్టత తీసుకోవడం అవసరం.
ఆఫర్లను పరిశీలిస్తే ఆదా
పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో జువెలరీ సంస్థలు మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాంటి ఆఫర్లను పరిశీలించి కొనుగోలు చేస్తే కొంత మేర ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఆఫర్ల పేరుతో నాణ్యతలో రాజీ పడకుండా హాల్‌మార్క్ ఉన్న నగలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొనుగోలు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి
బంగారం కొనుగోలు చేసిన తర్వాత సరైన ట్యాక్స్ ఇన్‌వాయిస్, రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిని భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో నగలను విక్రయించాలన్నా, మార్పిడి చేయాలన్నా లేదా బీమా కోసం ఉపయోగించాలన్నా ఈ పత్రాలు అవసరమవుతాయి. అందువల్ల కొనుగోలు సమయంలో డాక్యుమెంటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు
మీ ఇంట్లో ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? - ఇలా కూడబెట్టండి!
తెలిసిన వారే కదా అని మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? - ఈ ప్రమాదంలో పడే ఛాన్స్!

