LIVE: గన్నవరం ప్రజాగళం సభలో చంద్రబాబు- ప్రత్యక్షప్రసారం - Chandrababu Prajagalam sabha Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 3:44 PM IST

Updated : May 10, 2024, 4:11 PM IST

thumbnail

TDP Chief Chandrababu Prajagalam Public Meeting Live: స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం భూమికి చెట్టుకు ఉన్నంతగా ఉంటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వందల తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని దాచుకోవడమే కానీ ఆ తరాల మధ్య ప్రేమలను జగన్ పట్టించుకోడని విమర్శించారు. అందుకే చెల్లెళ్లను దూరంగా పెట్టాడని దుయ్యబట్టారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చాలా దుర్మార్గమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనా విధ్వంసంతో విలవిల్లాడుతున్న రాష్ట్రానికి కాయకల్ప చికిత్స చేస్తామని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నరకానికి నకళ్లుగా మారిన రహదారులన్నింటినీ రెండేళ్లలో పునర్నిర్మిస్తామని వాగ్దానం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల్ని ఆకర్షించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం గన్నవరం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : May 10, 2024, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.