Live: వైసీపీ పాలన - మాచర్లలో పిన్నెల్లి మాఫియాపై ప్రతిధ్వని - ప్రత్యక్ష ప్రసారం - MLA Pinnelli Anarchies in Macherla

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 7:30 PM IST

Updated : May 22, 2024, 7:58 PM IST

thumbnail

Pratidwani : ఒకప్పుడు ఎన్నికల్లో ఓటమి భయంతో బ్యాలెట్ బాక్సుల్లో నీళ్ళు పోయడం, బ్యాలెట్ పత్రాలపై ఇంకు పోయటం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం వంటి ఘటనలు జరిగేవి. ఆయా పార్టీలు పురమాయించిన దుండగులు అలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారు. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ( YCP MLA ) స్వయంగా పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన ఈవీఎ ( EVM )ను ధ్వంసం చేసి, అక్కడున్న సిబ్బందిని బెదిరించిన దృశ్యాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ అంటేనే అరాచకపార్టీ అని, మాచర్లలో మాఫియా సామ్రాజ్యం స్థాపించిందని గత ఐదేళ్లుగా ఏపీ పౌరసమాజం నెత్తీనోరు బాదుకుని చెప్పింది. ఇప్పుడు అదే నిజమని నిరూపణైంది. చీఫ్ సెక్రటరీ సహా మొత్తం యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తున్న సీఎం జగన్‌ రెడ్డి ఆప్తుడైన ఈ ఎమ్మెల్యే పొలిటికల్ క్రిమినల్‌లాగా వ్యవహరిస్తుంటే మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : May 22, 2024, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.