దేవుడి దర్శనం కోసం వస్తే డబ్బులు వసూలు చేస్తారా? ఇదెక్కడి న్యాయం - అధికారులను నిలదీసిన భక్తులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 5:28 PM IST

Updated : Feb 23, 2024, 7:09 PM IST

thumbnail

Srisailam Devotees Agitation in Nallamala Forest of Nandyal District : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పెరిగింది. ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరల పెంపుతోపాటు చెత్త పన్ను, ఇంటి పన్ను తదితరాల పేరుతో ప్రతి కుటుంబం నుంచి ఏడాదికి కనీసం రూ. లక్ష రూపాయిలు ప్రభుత్వం దోచుకుంటోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా దేవున్ని దర్శనం చేసుకోవాలన్న జగన్ సర్కారుకి డబ్బు చెల్లించాలంటున్నారు అధికారులు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, ఏటా శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్తుంటారు. వీరు నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రయాణం సాగిస్తారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాదయాత్రగా శ్రీశైలనికి వెళుతున్నారు. తాజాగా  నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పల్లెకట్ట వద్ద ఉన్న నల్లమల్ల ప్రాంతంలో అటవీ అధికారులు చెక్ పోస్టును ఏర్పాటు చేసి ఒక్కొ భక్తుడు నుంచి పది రూపాయల చొప్పున డబ్బు వసూలు చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ భక్తులు ఆందోళన చేపట్టారు. డబ్బులు వసూలు చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు. ఆర్డర్ కాపీ చూపించాలని అక్కడి అధికారులను నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంతసేపు ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని భక్తులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి భక్తులపై భారం వేయకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. 

Last Updated : Feb 23, 2024, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.