భద్రాద్రి రామయ్య కల్యాణానికి ముహూర్తం ఫిక్స్ - ఏప్రిల్‌ 9 నుంచి బ్రహ్మోత్సవాలు

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 7:58 PM IST

thumbnail

Srirama Navami Celebration In Bhadrachalam 2024 : భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జగదభిరాముడు శ్రీరామచంద్రుడుకి సీతమ్మ తల్లికి ఏడాదికి ఒకసారి శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి తేదీని అర్చకులు ఖరారు చేశారు. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు వసంత పక్షప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 

Bhadradri Ramayya Kalyanam Date 2024 : ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 16న సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం, 17న ఉదయం 10గంటల 30నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఏప్రిల్ 18న శ్రీరాముని మహా పట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్ధీ దృష్ట్యా ఏప్రిల్ 9 నుంచి 23 వరకు నిత్య కల్యాణ వేడుకను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.