LIVE: అయోధ్యలో వైభవంగా శ్రీరాముడి కళ్యాణ వేడుకలు - ప్రత్యక్ష ప్రసారం - Sri Rama Navami in Ayodhya

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 12:16 PM IST

Updated : Apr 17, 2024, 12:26 PM IST

thumbnail

Sri Rama Navami in Ayodhya Live : ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత జరగనున్న మొదటి శ్రీరామనవమి వేడుకల కోసం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో యోగీ సర్కార్​ అయోధ్య పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. 560 సీసీటీవీ కెమెరాలతో ఆలయం పరిసరాలను నిరంతరం కంట్రోల్​ రూమ్​ల నుంచి పోలీసులు పర్యవేక్షించనున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని అయోధ్యకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా 4 రోజుల పాటు అంటే సోమవారం నుంచి గురువారం వరకు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ తెలిపారు. అలాగే బాలక్​రాముడి హారతి సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాజస్థాన్​ నాథ్​ద్వారాలోని శ్రీనాథ్‌జీ అనే ఓ పురాతనమైన శ్రీ కృష్ణుడి ఆలయం నుంచి తొలిసారి మఠడీ అనే మహాప్రసాదాన్ని అయోధ్య రాముడి కోసం తరలించారు. బాలక్​రాముడికి ఈ మఠడీ ప్రసాదాన్ని నివేదించిన తర్వాత గుడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచనున్నారు. ఈ మేరకు లక్ష మఠడీల మహాప్రసాదాన్ని అయోధ్యకు పంపినట్లు శ్రీనాథ్‌జీ ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Last Updated : Apr 17, 2024, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.