మోటార్‌ సైకిల్‌ల్లోకి దూరిన పాము - చాకచక్యంగా బయటకు తీసిన స్నేక్ క్యాచర్

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 5:53 PM IST

thumbnail

Snake in Vehicle at Madhira : జనావాసాల్లోకి పాములు తరచూ రావడం చూస్తుంటాం కానీ ఓ పాము ఏకంగా మోటార్​ సైకిల్​​ల్లోకి దూరింది. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో శాంతి థియేటర్​ ఎదురుగా ఉన్న టైర్ల షాప్​లోకి ప్రవేశించిన పాము, తర్వాత మోటార్​ సైకిల్​ల్లోకి దూరింది. ఇది గమనించిన వాహన యజమాని వెంటనే స్నేక్​ క్యాచర్​, జంతు ప్రేమికుడు ఆర్కే ఫౌండేషన్​ ఛైర్మన్ దోర్నాల రామకృష్ణకు సమాచారమిచ్చాడు. రామకృష్ణ అతి చాకచక్యంగా పామును పట్టుకొని అడవిలో వదిలేశాడు.  

Rescue of Cobra Trapped in Dambar : గత కొద్దికాలంగా పాములు జనావాసాల్లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాయి. గత నెల ఓ నాగుపాము తారుడబ్బాలో పడి చావుబతుకుల మధ్య పోరాడింది. చివరకు స్నేక్​ క్యాచర్​ వచ్చి పామును రక్షించాడు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ కావడం వల్ల సోషల్​ మీడియాలో పలువురు అభినందిస్తున్నారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.