స్కిల్​ సెంటర్లపై అధికారులతో సమీక్షించిన సీఎస్ - అనంతరం వెబ్​సైట్ ఆవిష్కరణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 10:11 PM IST

thumbnail

CS Jawahar Reddy review on Skill Development Institute : రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ (Skill Development Institute in AP) ద్వారా గడచిన రెండేళ్లలో 3.6 లక్షల మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చినట్టు ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి (AP CS KS Jawahar Reddy) స్పష్టం చేశారు. దీంతో పాటు 1.81 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. 

సచివాలయంలో నైపుణ్య శిక్షణా సంస్థ, ఉపాధి అవకాశాలపై అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నైపుణ్య శిక్షణా సంస్థకు చెందిన వెబ్ సైట్​ను సీఎస్ లాంఛనంగా ఆవిష్కరించారు. అంతకుముందు నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు రాష్ట్రంలో యువతకు ఇచ్చిన శిక్షణా కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రాముఖ్యం కలిగిన వివిధ విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలతొ ఒప్పందం చేసుకుని యువతకు శిక్షణ ఇస్తున్నట్టు సీఎస్ జవహర్ రెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.