'యువత మేలుకో - చంద్రన్నను ఎన్నుకో - భావితరాల భవిష్యత్తు కోసం'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 4:33 PM IST

thumbnail

Short film on Amaravati farmers problems: సింగపూర్ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో అమరావతి రైతుల సమస్యలపై రూపొందించిన లఘుచిత్ర పోస్టర్ ను రాజధాని ఐకాస కమిటీ సభ్యులు పువ్వాడ సుధాకర్ ఆవిష్కరించారు. 'యువత మేలుకో - చంద్రన్నను ఎన్నుకో - భావితరాల భవిష్యత్తు కోసం' పేరుతో రూపొందించిన లఘు చిత్రాన్ని తుళ్లూరు మండలం అనంతరం గ్రామానికి చెందిన తరిగోపుల హరీష్ తెరకెక్కించారు. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో అమరావతి సాధించిన అభివృద్ధి, ప్రస్తుతం రాజధానిలో నెలకొన్న పరిస్థితులను కథాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించమని దర్శకులు చెప్పారు. 

లఘు చిత్రాన్ని రాజధాని ఫైల్స్ చిత్ర నిర్మాత రాజశేఖర్ తన యూట్యూబ్ ఛానల్ తెలుగు వన్​లో ప్రసారం చేస్తున్నారని హరీష్ తెలిపారు. రాజధాని ఉద్యమంలో మహిళలు చేసిన పోరాటాన్ని కథాంశంగా తీసుకొని ఓ చిత్రాన్ని రూపొందించాలని ఐకాస కమిటీ సభ్యులు పువ్వాడ సుధాకర్ దర్శకుడికి విజ్ఞప్తి చేశారు. లఘు చిత్రం దర్శకులు తరిగోపుల హరీష్ మాట్లాడుతు రాజధాని రైతల సమస్యలపై తప్పకుండా ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కిస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రావడం ఎంత అవసరమో ఈ లఘు చిత్రంలో చూపించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.