LIVE : మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రహ్మణి ఎన్నికల ప్రచారం - ప్రత్యక్షప్రసారం - BRAHMINI ELECTION CAMPAIGN LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 6:31 PM IST

Updated : May 4, 2024, 7:22 PM IST

thumbnail

Nara Lokesh Wife Brahmini At Mangalagiri Election Campaign Live : మంగళగిరి రూపురేఖలు మారాలంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ను గెలిపించాలని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ప్రజలను కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే మంగళగిరికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామన్నారు. మంగళగిరి చేనేత వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు అంతర్జాతీయ గర్తింపు రావాలంటే టీడీపీ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికి తాగు నీరందించే పథకాన్ని తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. సంక్షేమానికి పెద్దపీట వేసే టీడీపీకి ఓటేసి గెలిపించాలని బ్రాహ్మణి కోరారు. ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లి ఆర్వోకు లోకేశ్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : May 4, 2024, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.